'ధ్రువ' సినిమాలో అరవింద్ స్వామి పాత్ర చేయాలనిపించింది .. చిరంజీవి గారిని అడిగాను కూడా!: రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ధ్రువ' సినిమాలో అరవింద్ స్వామి పాత్ర చేయాలనిపించింది .. చిరంజీవి గారిని అడిగాను కూడా!: రాజశేఖర్

  • 'గరుడ వేగ'కి ముందే కొన్నిసార్లు చిరంజీవిని కలిశాను 
  • ఆ సమయంలోనే 'ధృవ' సినిమా ప్రస్తావన తెచ్చాను 
  • అందులో అరవింద్ స్వామి పాత్ర పట్ల ఆసక్తిని చూపాను 
  • నిర్మాత ప్రసాద్ గారు ఆ కారణం చెప్పారు      
గతంలో చిరంజీవితో రాజశేఖర్ కి మనస్పర్థలు వచ్చిన సంగతి తెలిసిందే. 'గరుడ వేగ' సినిమాకి ముందు చిరంజీవిని కలిసిన రాజశేఖర్, తమ మధ్య గల దూరానికి తెర దించేశారు. తాజాగా ఐ డ్రీమ్స్ తో రాజశేఖర్ మాట్లాడుతూ .. ఇంతకు ముందు కూడా కొన్ని స్టేజ్ లపైనా .. ఫంక్షన్స్ లోను చిరంజీవి .. నేను కలుసుకుని మాట్లాడుకోవడం జరిగింది" అన్నారు.

" అలా మాట్లాడుకునే సందర్భంలోనే 'ధృవ' సినిమాను గురించి ప్రస్తావించాను. ఆ సినిమాలో అరవింద్ స్వామి పాత్ర నాకు బాగా నచ్చింది సార్ అని అన్నాను. "మీరు చేయాలనుకుంటున్నారా?" అని ఆయన అడిగితే, అవునన్నట్టుగా చెప్పాను. ఆ తరువాత ఆ సినిమా నిర్మాత ఎన్వీ ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి .. అరవింద్ స్వామిని పెట్టుకోవడం వలన ఎన్నో పాత షాట్స్ మేం యూజ్ చేసుకోవచ్చు. .. మీరు ఇంట్రెస్ట్ చూపించినందుకు థ్యాంక్స్ అని అన్నారు .. అదీ జరిగింది" అంటూ చెప్పుకొచ్చారు.     
rajasekhar
jeevitha

More Telugu News