ఓపెన్ గా మాట్లాడటం వలన చాలా ఇబ్బందులు పడ్డాను: రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓపెన్ గా మాట్లాడటం వలన చాలా ఇబ్బందులు పడ్డాను: రాజశేఖర్

  • ఏదీ దాచుకోకుండా మాట్లాడేసేవాడిని
  • అందువలన కొంతమంది హర్ట్ అయ్యారు 
  • ఇప్పుడు కొంచెం కేర్ ఫుల్ గా ఉంటున్నాను  
"మీరు మనసు విప్పి మాట్లాడుతుంటే .. చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ విధంగా మాట్లాడటం వలన ఇండస్ట్రీలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి"? అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రాజశేఖర్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఓపెన్ గా మాట్లాడటం వలన చాలా ఇబ్బందులు పడ్డాను .. కొన్ని విషయాలను నేను దాచుకోకుండా చెప్పేస్తుంటాను. అందువలన హర్ట్ అయిన వాళ్లు కూడా వున్నారు" అని అన్నారు.

 "ఈ విషయంలో ఇప్పుడు నేను కొంచెం కేర్ ఫుల్ గా ఉంటున్నాను. నిజాలు చెప్పి ఎవరినీ నొప్పించకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఓపెన్ గా వుంటాను .. లౌక్యం తెలియదు .. అందువలన అవతల వాళ్లు నా రెమ్యునరేషన్ తగ్గించే ప్రయత్నాలు చేసేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో ఆ విషయాలను కూడా జీవిత మాట్లాడేది. జీవిత అన్ని విషయాలను విని సెట్ చేస్తుంది. ఇంతకు ముందు సినిమాకి ఇంత లాస్ అయ్యాము .. ఈ సినిమాలో వస్తే ఇస్తాము అని జీవితతో అంటారు. అలా చెప్పేసి ఇవ్వని వాళ్లూ వున్నారు" అంటూ చెప్పుకొచ్చారు.       
rajasekhar
jeevitha

More Telugu News