ఎక్కడికైనా మేమంతా కలిసే వెళతాం .. కలిసే వస్తాం .. కారణం ఇదే!: రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎక్కడికైనా మేమంతా కలిసే వెళతాం .. కలిసే వస్తాం .. కారణం ఇదే!: రాజశేఖర్

  • యాక్టింగ్ .. హెల్త్ విషయాలపైనే నేను దృష్టి పెడతాను 
  • మిగతా ఇంటి పనులన్నీ జీవితే చూసుకుంటుంది 
  • ఎక్కడికి వెళ్లినా నేనే కారు డ్రైవ్ చేస్తాను 
  • ఫ్లైట్ నేను నడపడం కుదరదు గదా .. అందుకే భయం
రాజశేఖర్ ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. "నేను యాక్టింగ్ కి సంబంధించిన విషయాలపైన .. హెల్త్ కి సంబంధించిన విషయాలపైన మాత్రమే శ్రద్ధ పెడుతూ వుంటాను. ఇంటికి సంబంధించిన మిగతా విషయాలన్నీ జీవితే చూసుకుంటూ ఉంటుంది. మా పెద్దమ్మాయి 10 రోజుల పాపగా వున్నప్పుడే నేను ఔట్ డోర్ షూటింగ్ కి తీసుకెళ్లాను. అప్పటి నుంచి ఔట్ డోర్ షూటింగ్ ఎక్కడ వున్నా వాళ్లు లేకుండగా నేను వెళ్లలేదు" అని అన్నారు.

"పిల్లలు పుట్టిన తరువాత నేను ఇంతవరకూ ఒంటరిగా ఫ్లైట్ లో వెళ్లలేదు. ఉదయం వెళ్లి సాయంత్రం రావాలన్నా నలుగురం వెళతాం .. నలుగురం వస్తాం .. ఎందుకంటే అదో భయం. ఎక్కడికి వెళ్లినా నేనే కారు నడుపుతాను .. వేరే వాళ్లు కారు నడిపితే వాళ్లపై నాకు అంత నమ్మకం ఉండదు. ఫ్లైట్ నేను నడపలేను గదా .. అందుకే భయం. పోతే అందరం కలిసి పోతాం .. ఉంటే అందరం కలిసి ఉంటాం .. ఆ ఉద్దేశంతోనే అలా చేస్తాను" అని చెప్పుకొచ్చారు.    
rajasekhar
jeevitha

More Telugu News