ఇకపై సొంతంగా సినిమాలు చేయనని అమ్మకి మాట ఇచ్చాను : రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇకపై సొంతంగా సినిమాలు చేయనని అమ్మకి మాట ఇచ్చాను : రాజశేఖర్

  • అమ్మతోనే నేను ఎక్కువ చనువుగా ఉండేవాడిని 
  • ప్రతి విషయం అమ్మతోనే చెప్పేవాడిని 
  • సినిమాల కోసం ఆస్తులు పోగొట్టుకున్నవారి గురించి అమ్మకి తెలుసు
  • అందుకే నా విషయంలో అమ్మ బాధపడింది  
రాజశేఖర్ హీరోగా చేసిన 'గరుడ వేగ' .. విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ పట్ల రాజశేఖర్ చాలా హ్యాపీగా వున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఐ డ్రీమ్స్ తో ముచ్చటించారు. "అమ్మ బ్రతికుంటే ఈ సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేసేవారు?" అనే ప్రశ్నకు ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. "చిన్నప్పటి  నుంచి నేను అమ్మతోనే ఎక్కువ చనువుగా ఉండేవాడిని. ఏ విషయమైనా అమ్మతోనే మాట్లాడేవాడిని. నాన్నకు చెప్పవలసిన విషయాలను కూడా అమ్మతోనే చెప్పించేవాడిని" అని అన్నారు.

 "ఆమె ప్రతి విషయంలోను ఎంతో కేర్ ఫుల్ గా ఉండేవారు. కొంతమంది యాక్టర్స్ చివరి రోజుల్లో సినిమాల్లో డబ్బులు పోగొట్టుకుని ఫ్లాట్ ఫామ్ మీదికి వచ్చిన కథలు ఆమె విన్నారు. నేను కొన్ని సినిమాలు తీసి .. ప్రాపర్టీస్ అమ్ముకోవడం మా అమ్మకి బాధను కలిగించింది. ఈ వయసులో అమ్మా నాన్నలను సంతోష పెట్టాలే గానీ .. బాధ పెట్ట కూడదు అనిపించింది. దాంతో సొంత సినిమాలు నేను ఇకపై చేయనమ్మా .. ప్రాపర్టీస్ కూడా ఏమీ అమ్మను" అంటూ మాటిచ్చాను. ఆమె ఈ సినిమా టీజర్ చూసి చాలా  ఆనందించారు .. ఆమె బ్రతికుంటే సినిమా హిట్ అయిందని తెలిసి మరింత సంతోషపడేవారు" అంటూ చెప్పుకొచ్చారు.      
rajasekhar
pooja kumar

More Telugu News