ఓవర్సీస్ లో 'రాజా ది గ్రేట్' ను టార్గెట్ చేసిన 'గరుడవేగ'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓవర్సీస్ లో 'రాజా ది గ్రేట్' ను టార్గెట్ చేసిన 'గరుడవేగ'

  • 5 రోజుల్లోనే 15 కోట్లు రాబట్టిన 'గరుడ వేగ' 
  • ఓవర్సీస్ లోను తగ్గని దూకుడు 
  • అదనంగా పెంచబడిన స్క్రీన్స్ 
  • నాగ్, రామ్ సినిమాల వసూళ్లను క్రాస్ చేసేసింది 
  • 'రాజా ది గ్రేట్' వసూళ్లకు చేరువలో ..        
రాజశేఖర్ హీరోగా థియేటర్స్ కి వచ్చిన 'గరుడ వేగ' .. విడుదల రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. రెండవ రోజు నుంచే ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తోంది. 5 రోజుల్లోనే 15 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.

 ఓవర్సీస్ లోని కొన్ని ప్రాంతాల్లో స్క్రీన్స్ పెంచడం ఓ విశేషమైతే, అక్కడ 'రాజుగారి గది 2' .. 'ఉన్నది ఒకటే జిందగీ' వసూళ్లను ఈ సినిమా అధిగమించడం మరో విశేషం. ప్రస్తుతం అక్కడ ఈ సినిమా, 'రాజా ది గ్రేట్' వసూళ్లకు దగ్గరలో వుంది. ఈ వసూళ్లను కూడా 'గరుడ వేగ' క్రాస్ చేసే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. చాలా గ్యాప్ తరువాత రాజశేఖర్ చేసిన 'గరుడ వేగ' .. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దూసుపోతుండటం పట్ల ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.      
rajasekhar
pooja kumar

More Telugu News