'గరుడ వేగ' రీమేక్ రైట్స్ కోసం గట్టి పోటీ .. రాజశేఖర్ కి భారీగా లాభాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గరుడ వేగ' రీమేక్ రైట్స్ కోసం గట్టి పోటీ .. రాజశేఖర్ కి భారీగా లాభాలు!

  • రాజశేఖర్ కి హిట్ తెచ్చిపెట్టిన 'గరుడ వేగ'
  • భారీగా రాబడుతోన్న వసూళ్లు 
  • మంచి రేటుకి శాటిలైట్ రైట్స్
చాలా గ్యాప్ తరువాత రాజశేఖర్ చేసిన 'గరుడ వేగ' .. ఆయనకి ఎంతో ఊరటనిచ్చింది. ఎంతోకాలంగా ఆయన ఎదురుచూస్తోన్న సక్సెస్ ను అందించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. థియేటర్స్ నుంచి ఈ సినిమా రాబట్టే వసూళ్ల సంగతి అటుంచితే, శాటిలైట్ రైట్స్ పరంగా .. రీమేక్ రైట్స్ పరంగా ఈ సినిమా రాజశేఖర్ కి భారీగా లాభాలు తెచ్చిపెడుతోందని అంటున్నారు.

 ఈ సినిమాకి నిర్మాతగా వేరే వ్యక్తి పేరు వినిపిస్తున్నప్పటికీ, పెట్టుబడిలో మేజర్ షేర్ రాజశేఖర్ దేననే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగు .. హిందీ శాటిలైట్ హక్కులను భారీ రేటుకు విక్రయించినట్టు తెలుస్తోంది. ఇక రీమేక్ రైట్స్ కోసం ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారట. తమిళ రీమేక్ రైట్స్ ను ఓ సంస్థకి భారీ రేటుకు ఇచ్చేందుకు రాజశేఖర్ ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. అన్ని భాషల్లోని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం వలన, ఈ స్థాయిలో డిమాండ్ ఉందని చెప్పుకుంటున్నారు.   
rajasekhar
poojakumar

More Telugu News