మద్యం విక్రయాలు పెరగాలంటే మహిళల పేర్లు పెట్టాలన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న మహారాష్ట్ర మంత్రి
- క్షమించాలని వేడుకున్న మంత్రి గిరీష్ మహజన్
- మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని వ్యాఖ్య
- ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో చర్చించానన్న మంత్రి
ఈ వ్యాఖ్యలపై చాలా మంది మహిళా సంఘాల నేతలు, సామాజిక వాదులు, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో దిగి వచ్చిన మంత్రి ఈ వివాదంపై స్పందిస్తూ... 'నా వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. క్షమాపణలు అడుగుతున్నాను. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు' అన్నారు. ఈ విషయం గురించి తాను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కూడా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.