Rahul Gandhi: అమ్మ‌కు ఫ‌ర్వాలేదు.. ఆందోళన చెందద్దు!: సోనియా గాంధీకి అస్వ‌స్థ‌త‌పై రాహుల్

షార్ట్స్‌లో చూడండి
హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సిమ్లాలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వ‌స్థ‌తకు గురికాగా, ఆమెను వెంట‌నే ఢిల్లీలోని గంగారామ్‌ ఆసుప‌త్రికి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌నకు గుర‌వుతోన్న నేప‌థ్యంలో ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందించారు.

అమ్మ‌కు ఫ‌ర్వాలేద‌ని చెప్పారు. స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో సోనియా గాంధీని ఢిల్లీకి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమీలేద‌ని చెప్పారు. త‌మ పట్ల చూపిస్తోన్న ప్రేమ‌, అభిమానాల‌కు ధన్య‌వాదాలు చెబుతున్నాన‌ని పేర్కొన్నారు.   
Go Back to Shorts
Rahul Gandhi
Congress

More Telugu News