వాట్సాప్‌లో కొత్త ఫీచర్... పొరపాటున పంపిన సందేశాలను తొలగించే అవకాశం
- ప్రస్తుతం కొద్దిమందికే అందుబాటులో
- దశల వారీగా `మెస్సేజ్ రీకాల్` ఫీచర్ అమలు
- గ్రూప్‌లో పెట్టిన సందేశాలను కూడా తొలగించే సదుపాయం
పొరపాటున పంపే మెసేజ్‌ల వల్ల కలిగే ఇబ్బందులను తొలగించడానికి వాట్సాప్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవల లైవ్ లొకేషన్ పేరుతో కూడా ఓ ఫీచర్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కొత్త వెర్షన్‌తో అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. కేవలం టెక్ట్స్ సందేశాలు మాత్రమే కాకుండా ఫొటోలు, జిఫ్ ఫైల్స్, వీడియోలు, కాంటాక్ట్‌లను కూడా ఈ ఫీచర్ ద్వారా రీకాల్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ పనిచేయాలంటే అవతలి వ్యక్తి కూడా తన వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. గ్రూప్‌లో మెసేజ్‌లను మాత్రం ఎవరూ చదవకముందే రీకాల్ చేసుకోవాలి. ఒక్కరు చదివినా ఆ సందేశాన్ని రీకాల్ చేసుకోలేరు. మనం పంపిన సందేశాలను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.