నిలోఫర్ ఆసుపత్రిలో కిడ్నాపైన నవజాత శిశువు కథ విషాదాంతం!

  • ఆదివారం నిలోఫర్ ఆసుపత్రిలో కిడ్నాప్ కు గురైన నవజాత శిశువు మృతి
  • నాగర్ కర్నూల్ జిల్లా బండోనిపల్లి శివారులో మృతశిశువును పూడ్చిపెట్టిన కిడ్నాపర్లు
  • బాధిత కుటుంబంతో సన్నిహితంగా ఉండే మంజుల అనే మహిళే కిడ్నాపర్
నిలోఫర్ ఆసుపత్రిలో నవజాత శిశువు కిడ్నాప్ విషాదాంతమైంది. హైదరాబాదులోని నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారి అమ్మమ్మను ఏమార్చి బిడ్డను ఎత్తుకెళ్లిన ఘటన ఆదివారం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి సకాలంలో వైద్యం అందకపోవడంతో సోమవారం రాత్రే మృతి చెందింది.

మృతిచెందిన శిశువును నాగర్ కర్నూల్ జిల్లా బండోనిపల్లి శివారులో కిడ్నాపర్లు పూడ్చిపెట్టారు. కిడ్నాప్ చేసింది బాధిత కుటుంబంతో సన్నిహితంగా ఉండే మంజుల అనే మహిళ అని పోలీసులు తేల్చారు. దీంతో మంజుల, ఆమె భర్త కొమురయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంజులకు పలు మార్లు గర్భస్రావం కావడంతో పెంచుకోవడానికి గాను ఈ శిశువును కిడ్నాప్ చేసినట్టు నిందితులు తెలిపారు. 
Go Back to Shorts
hydarabad
nilofar hospital
baby kidnap
dead

More Telugu News