వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్.. ఇక ఫోన్ నంబరు మార్చినా బేఫికర్!

  • తరచూ నంబర్లు మార్చే వారి కోసం సరికొత్త ఆప్షన్
  • తాజా అప్‌డేట్ వెర్షన్‌తో తగ్గనున్న యాప్ సైజు
  • నంబరు మార్చిన ప్రతిసారి నోటిఫికేషన్ ద్వారా మిత్రులకు
మరో అద్భుతమైన ఫీచర్‌తో మైక్రో బ్లాగింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల ముందుకొచ్చింది. ఇకపై మారిన నంబరును మిత్రులకు పదేపదే చెప్పాల్సిన అవసరం లేకుండానే వారికి తెలిసేలా కొత్త అప్‌డేట్ వెర్షన్‌లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు నంబరు మార్చితే ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి మెసేజ్‌ల ద్వారానో, ఫోన్ చేసో చెప్పాల్సి వచ్చేది.

అయితే, ఇకపై వినియోగదారులు తమ నంబరు మార్చితే ఆ విషయాన్ని మన అనుమతి మేరకు స్నేహితులకు నోటిఫికేషన్ ద్వారా వెళ్లిపోతుంది. తరచూ నంబర్లు మార్చే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ఇటీవల వరుసపెట్టి తాజా ఫీచర్లను అప్‌డేట్ చేసుకుంటూ వస్తున్న వాట్సాప్ ఈసారి ఈ ఆప్షన్‌ను జోడించాలని నిర్ణయించింది. అలాగే తాజా అప్‌డేట్ వెర్షన్‌లో యాప్ సైజు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.  
Go Back to Shorts
whatsapp
feature
update

More Telugu News