రాబోయే రోజుల్లో క్రికెట్ రారాజులం మనమే: రోహిత్
- ఆటగాళ్లందరిలోనూ కసి కనిపిస్తోంది
- రిజర్వ్ బెంచ్ ఎంతో బలంగా ఉంది
- ఎవరికి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకుంటున్నారు
జట్టులో ఎవరికి అవకాశం కల్పించినా... వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పాడు. దీనికి ఐదో వన్డేనే ఉదాహరణ అని... చాహల్ కు విశ్రాంతినిచ్చి అక్షర్ పటేల్ కు స్థానం కల్పిస్తే, అతను సత్తా చాటాడని తెలిపాడు. జట్టులో ప్రతి ఒక్కరిలోనూ కసి కనిపిస్తోందని చెప్పాడు. ఇలాంటివన్నీ భారత క్రికెట్ భవిష్యత్తు అమోఘంగా ఉండబోతోందనే చెబుతున్నాయని అన్నాడు. రానున్న రోజుల్లో మనమే రారాజులం అని చెప్పాడు.