sindhu menon: రోడ్డు ప్రమాదంలో గాయపడిన నటి సింధు మీనన్ తల్లి!

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ తో పాటు, దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించిన నటి సింధు మీనన్ తల్లి శ్రీదేవి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, శ్రీదేవి నిన్న తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బెంగళూరులోని మత్తికెర సర్కిల్ వద్ద ఆటో ఎక్కారు. ఇంతలో ఆటోను వెనక నుంచి వచ్చిన ఓ క్యాబ్ ఢీకొంది. దీంతో, ఆటోలో ఉన్న సింధు తల్లికి గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంతో ఆమె బాధతో విలవిల్లాడిపోయారు. అయితే, ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడం మానేసి... ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఇద్దరూ గొడవకు దిగారు. చుట్టుపక్కల వారు కూడా శ్రీదేవికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈ క్రమంలో, శ్రీదేవి తన బంధువులకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న సింధు సోదరుడు ఆమెను స్థానిక రామయ్య ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు ఛాతీలో బలమైన గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. 
Go Back to Shorts
sindhu menon
actress sindhu menon
tollywood

More Telugu News