nagachaitanya: మారుతి, నాగచైతన్యల సినిమాకి టైటిల్ ఫిక్స్!

షార్ట్స్‌లో చూడండి
మొదట్లో యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను తెరకెక్కిస్తూ వచ్చిన మారుతి, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించాలనే ఆలోచన చేస్తూ వచ్చాడు. ఈ విషయంలో టైటిల్ దగ్గర నుంచే ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. ఫలితంగా 'భలే భలే మగాడివోయ్' .. 'బాబు బంగారం' .. 'మహానుభావుడు' రూపొందాయి.

 ఈ మూడు సినిమాల విషయంలోనూ టైటిల్ పరంగా ఆయన మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి మారుతి .. నాగ చైతన్య కథానాయకుడిగా తెరకెక్కించనున్న తన తదుపరి సినిమాకి కూడా టైటిల్ ఫిక్స్ చేశాడు. 'మంచోడు' అనే టైటిల్ ను నిర్ణయించి దానిని రిజిస్టర్ చేయించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కథానాయికగా మేఘా ఆకాశ్ పేరు వినిపిస్తోంది.      
Go Back to Shorts
nagachaitanya
megha akash

More Telugu News