సమంతా పెళ్లి చీర మరింత ప్రత్యేకమట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సమంతా పెళ్లి చీర మరింత ప్రత్యేకమట!

జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలనే యువతులంతా కోరుకుంటూ వుంటారు. అందువలన పెళ్లికి సంబంధించిన ప్రతి అంశానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ వుంటారు. ముఖ్యంగా 'పెళ్లి చీర' విషయంలో మరింత శ్రద్ధ పెడతారు. వేదికపై ప్రత్యేకతను తెచ్చిపెట్టే 'పెళ్లి చీర' విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. నిపుణుల చేత తమ అభిరుచికి అనుగుణంగా డిజైన్ చేయించుకుంటూ వుంటారు.

 ప్రస్తుతం సమంత అదే పనిలో ఉందట. నాగచైతన్యతో సమంతా వివాహం గోవాలో జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ పెళ్లి తంతు జరగనుంది. ముందుగా హిందూ సంప్రదాయం ప్రకారం .. ఆ తరువాత క్రిష్టియన్ సంప్రదాయం ప్రకారం చైతూ - సమంత వివాహం జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే వివాహ వేడుకలో, రామానాయుడు గారి భార్య రాజేశ్వరి .. అంటే నాగచైతన్య అమ్మమ్మ ధరించిన చీరను సమంతా ధరించనుంది. స్టైలీష్ డిజైనర్ క్రేషా .. ఈ చీరకు అదనపు హంగులు జోడించనుందట. సమంతా ఈ చీరను ధరించడం వలన .. దగ్గుబాటివారి కుటుంబ గౌరవాన్ని కూడా ధరించినట్టు అవుతుందన్న మాట.  
samanta
nagachaitanya

More Telugu News