ఫోన్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి కార్మికుడి దారుణ హత్య

Telangana
Advertisement
  • గోదావరిఖనిలో సింగరేణి ఉద్యోగి దారుణ హత్య
  • కత్తులతో విచక్షణారహితంగా పొడిచిన దుండగులు
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
  • హత్యకు గల కారణాలపై కొనసాగుతున్న విచారణ
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సోమవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌)లో పనిచేస్తున్న రాజశేఖర్ అనే ఉద్యోగిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పవర్ హౌస్ కాలనీలో నివసించే రాజశేఖర్ (30)కు ఈరోజు తెల్ల‌వారుజామున‌ 2 గంటల సమయంలో ఫోన్ వచ్చింది. అతడిని బయటకు పిలిచిన నలుగురు యువకులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. విచక్షణారహితంగా పలుమార్లు పొడవడంతో రాజశేఖర్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.

ఈ హత్యోదంతం మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement

సంబంధిత వార్తలు

RajasekharGodavarikhani murderSingareni worker killedPeddapalli crime newsSCCL employeeTelangana crime

More Telugu News

15 ఓవర్లు ఉండగానే మ్యాచ్‌ను ఎందుకు వదిలేశారు? తొలి టెస్టు డ్రాపై కెప్టెన్ గిల్ వివరణ

23 Nov, 11:41

బీఆర్ఎస్ నేతల నిర్బంధంపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

23 Nov, 11:39

కోడింగ్, లెక్కలు అన్నీ ఏఐకేనా? ఇకపై మనుషులు గ్రంథాలు చదువుకోవాల్సిందేనా? జోహో బాస్ షాకింగ్ పోస్ట్!

23 Nov, 11:38

మేయర్ ప్రసంగం ఇస్తుంటే.. వెనుక వ్యక్తి వింత చేష్టల‌తో నెట్టింట 'ఏలియన్' అయిపోయాడు!

23 Nov, 11:37

శ్రీ సత్యసాయి బాబా జయంతి ఇకపై రాష్ట్ర పండుగ: నారా లోకేశ్

23 Nov, 11:36

పేదరికం అంటే డబ్బులు లేకపోవడమే కాదు.. లింక్డిన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి పోస్ట్‌ వైరల్

23 Nov, 11:35

బిస్లరీపై ప్రాసిక్యూషన్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి.. స్పందించిన యాజమాన్యం

23 Nov, 11:30

టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్.. డ్రా తో ముగిసిన మొదటి టెస్ట్

23 Nov, 11:28

సన్నీ డియోల్ కొడుకుతో సారా టెండూల్కర్ పెళ్లి?.. అసలు నిజమిదే!

23 Nov, 11:27

50 లక్షల మందితో పోటెత్తనున్న అరుణాచలం.. గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తులు ఈ టైమింగ్స్ గుర్తుంచుకోండి!

23 Nov, 11:19

మానవాళికి ప్రేమ, సేవలను నేర్పిన మహనీయుడు సత్యసాయి: చంద్రబాబు

23 Nov, 11:00

ఆసీస్ జట్టు మొత్తానికీ తెలుసు.. 'శాండ్‌పేపర్‌గేట్‌'పై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు!

23 Nov, 10:33

పట్టణ జీవనంతో పేగులకు చేటు.. పెరుగుతున్న ఊబకాయం, షుగర్!

23 Nov, 10:31

ఒకవైపు ఎన్విడియా బాస్‌తో అఫైర్.. మరోవైపు చైనా నిఘా వర్గాలతో లింకులు! ఆలిస్‌పై సంచలన నివేదిక!

23 Nov, 10:25
..More Telugu News