ఏపీపై నమ్మకంతో ఇంతటి భారీ పరిశ్రమ ఏర్పాటు చేసిన రిలయన్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు: లోకేశ్

Andhra
Advertisement
  • కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉత్పత్తి ప్రారంభించిన రిలయన్స్ ప్లాంట్
  • కేవలం 12 నెలల్లోనే సిద్ధమైన ఆసియాలోనే అతిపెద్ద బెవరేజ్ యూనిట్
  • స్థానిక యువతకు లభించనున్న 1,200 ప్రత్యక్ష ఉద్యోగాలు
  • కూటమి ప్రభుత్వ 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు ఓర్వకల్లే ప్రత్యక్ష నిదర్శనమన్న లోకేశ్
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద పానీయాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సరిగ్గా ఏడాది క్రితం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగ్గా, కేవలం 12 నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ప్లాంట్‌లో కాంపా కోలాతో పాటు పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ తాగునీటి తయారీ మొదలైంది. ప్రభుత్వం నినదిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు ఓర్వకల్లు ప్లాంట్ ఒక ప్రత్యక్ష నిదర్శనమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్‌పై పూర్తి నమ్మకంతో రాష్ట్రంలో ఇంతటి భారీ పరిశ్రమను ఏర్పాటు చేసిన రిలయన్స్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, వేగవంతమైన నిర్ణయాలపై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.

తరతరాల భారతీయుల జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న స్వదేశీ బ్రాండ్ కాంపా కోలా, ఇప్పుడు రాయలసీమ గడ్డపై సరికొత్త రూపంలో పునర్జన్మ పొందిందని లోకేశ్ వివరించారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పోటీపడే సత్తా ఉన్న స్వదేశీ బ్రాండ్లకు ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం రాష్ట్రానికే గర్వకారణమని చెప్పారు. ఓర్వకల్లులో తయారయ్యే ఉత్పత్తులు దేశంలోని ప్రతి ఇంటికీ చేరడంతో పాటు ప్రపంచ మార్కెట్లలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయని ఆయన అన్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్లాంట్ ద్వారా స్థానిక యువతకు సొంత గడ్డపైనే ఉపాధి లభించడం అత్యంత సంతృప్తిని ఇస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం యువత కుటుంబాలను, ఊళ్లను వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఉద్యోగాలే యువతను వెతుక్కుంటూ రావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రాయలసీమ ప్రజలకు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు.

ఈ భారీ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు 1,200 ప్రత్యక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయని, అదే సమయంలో రవాణా, వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాల్లో పెద్దఎత్తున పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నంద్యాలకు చెందిన మహేశ్ హరి, కర్నూలుకు చెందిన ఆర్.కె. స్ఫూర్తి వంటి స్థానిక యువతీ యువకులు సొంత ప్రాంతంలోనే ఇలాంటి ప్రపంచ స్థాయి సంస్థలో పనిచేస్తుండటం శుభపరిణామమని లోకేశ్ ప్రస్తావించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి భవిష్యత్తులో ఇలాంటి విజయగాథలు మరిన్ని రావాలని, అందరం కలిసి ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement

సంబంధిత వార్తలు

Nara LokeshReliance beverage plantOrvakal KurnoolAndhra Pradesh investmentsSpeed of Doing BusinessReliance plant Kurnool

More Telugu News

రైలు పక్కనే నడుస్తూ కుమార్తెకు వీడ్కోలు పలికిన తల్లిదండ్రులు.. ఎమోషనల్ వీడియో వైరల్

21 Nov, 18:54

వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్.. ముగ్గురు నేతలు అలగడం నాకు నచ్చలేదు: సీఎం చంద్రబాబు

21 Nov, 18:35

'అన్బిల్ అవన్' (సోనీలివ్) మూవీ రివ్యూ!

21 Nov, 18:33

సల్మాన్ ఖాన్ నుంచి ఐశ్వర్యా రాయ్‌ను కాపాడేందుకే నన్ను పెట్టారు: కేతన్ కరాండే

21 Nov, 18:13

తొలి టెస్టుకు సిరాజ్‌ను పక్కన పెట్టడంపై తెలంగాణ మంత్రి అజహరుద్దీన్ అసంతృప్తి

21 Nov, 18:08

చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు: సీపీఐ రామకృష్ణ

21 Nov, 17:47

ఆసియాలోనే అతి పెద్ద రిలయన్స్ పానీయాల ఫ్యాక్టరీ.. ఓర్వకల్లు వేదికగా కాంపా కోలా ప్రస్థానం మళ్లీ మొదలైంది: లోకేశ్

21 Nov, 17:44

నాకు రూ. 500 కోట్ల ఆస్తి లేదు.. అద్దె ఇంట్లోనే ఉంటున్నా: అనుపమ్ ఖేర్

21 Nov, 17:43

నెల్లూరు కార్పొరేషన్ చివరి సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు

21 Nov, 17:25

మార్కెట్ నుంచి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఔట్.. వెబ్‌సైట్ నుంచి తొలగించిన కంపెనీ!

21 Nov, 17:22

రైలు బోగీలో మహిళపై హత్యాచారం.. నిందితుడ్ని పట్టించిన పాము ఆకారపు ఉంగరం

21 Nov, 17:19

కొత్త పింఛన్లపై సీఎం రేవంత్‌కు కౌశిక్ రెడ్డి రాజీనామా సవాల్

21 Nov, 17:04

శాండ్‌పేపర్ వివాదం.. ఆ చీకటి రోజుల్లోకి మళ్లీ వెళ్లలేను: డారెన్ లీమన్

21 Nov, 17:01

'ఆపరేషన్ సిందూర్‌' వేళ పాక్‌కు చైనా రహస్య సాయం.. అమెరికా నివేదికలో బండారం బట్టబయలు!

21 Nov, 16:56
..More Telugu News