- టీడీపీ కూటమిలో 27 జడ్పీలకు అభ్యర్థులు ఖరారు
- టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి ఒక చైర్‌పర్సన్ పదవి
- శ్రీసత్యసాయి జడ్పీ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ ఎంపిక
- నేడు జడ్పీ కార్యాలయాల్లో జరగనున్న పరోక్ష ఎన్నిక
- అల్లూరి జిల్లా పీఠం దక్కించుకోనున్న వైఎస్సార్సీపీ
ఆంధ్రప్రదేశ్‌లో 27 జిల్లా పరిషత్‌లకు (జడ్పీ) చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవుల పంపకాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఖరారు చేసింది. ఈ పదవులకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీకి 22 చైర్‌పర్సన్, 20 వైస్ చైర్‌పర్సన్ పదవులు దక్కగా, జనసేనకు 4 చైర్‌పర్సన్, 5 వైస్ చైర్‌పర్సన్, బీజేపీకి ఒక చైర్‌పర్సన్, 2 వైస్ చైర్‌పర్సన్ పోస్టులు కేటాయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. ఇటీవల జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో, రాష్ట్రంలోని మొత్తం 28 జడ్పీలకు గానూ 27 చోట్ల స్పష్టమైన ఆధిక్యం లభించింది. మిగిలిన ఒక్కటైన అల్లూరి సీతారామరాజు జిల్లా పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో స్థానిక జడ్పీ కార్యాలయాల్లో ఈ పరోక్ష ఎన్నిక జరుగుతుంది. ముందుగా కో-ఆప్టెడ్ మైనారిటీ సభ్యులను ఎన్నుకున్న తర్వాత, ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లను ఎన్నుకుంటారు.
టీడీపీ ప్రకటించిన కీలక అభ్యర్థుల్లో శ్రీసత్యసాయి జిల్లాకు పరిటాల శ్రీరామ్, విజయనగరానికి మజ్జి సిరి సహస్ర, ఏలూరుకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని సాయి నవ్యశ్రీ ఎంపికయ్యారు. విశాఖపట్నంకు గడు అలివేణి పేరును ఖరారు చేశారు. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో జనసేన అభ్యర్థులు చైర్‌పర్సన్‌లుగా పోటీ చేయనున్నారు.