ఉబర్‌లో భారీ డేటా లీక్.. డ్రైవర్ల వివరాలు బహిర్గతం!

Business
Advertisement
  • ఉబర్‌లో మరోసారి డేటా బ్రీచ్ కలకలం
  • థర్డ్ పార్టీ సంస్థ వైఫల్యం కారణంగా లీకైన సమాచారం
  • డ్రైవర్ల లైసెన్స్ వివరాలు సహా వ్యక్తిగత డేటా బహిర్గతం
  • లీకైన సమాచారం దుర్వినియోగం కాలేదన్న ఉబర్
  • ప్రభావితమైన వారికి 90 రోజుల పాటు ఉచిత సేవలు
ప్రముఖ రైడ్-హెయిలింగ్ సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్ మరోసారి డేటా బ్రీచ్‌తో వార్తల్లో నిలిచింది. తమ భాగస్వామ్య సంస్థ అయిన 'ఫైర్‌వర్క్స్ ఏఐ' వైఫల్యం కారణంగా డ్రైవర్లకు చెందిన కీలక వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు ఉబర్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనలో డ్రైవర్ల లైసెన్స్ వివరాలు కూడా బహిర్గతమైనట్లు తెలియడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఫైర్‌వర్క్స్ ఏఐ సంస్థకు చెందిన ఇంటర్నల్ క్రెడెన్షియల్స్‌ను ఓ గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించి, వాటి ద్వారా ఉబర్‌కు సంబంధించిన డేటాను యాక్సెస్ చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అక్టోబర్ 9న ఈ విషయాన్ని గుర్తించిన ఉబర్, వెంటనే ఫైర్‌వర్క్స్ ఏఐతో ఉన్న డేటా సంబంధాలను నిలిపివేసి, విచారణకు ఆదేశించింది.

ఈ ఘటనలో మొత్తం ఎంతమంది ప్రభావితమయ్యారనే సంఖ్యను ఉబర్ వెల్లడించనప్పటికీ, అమెరికాలోని పలు రాష్ట్రాల అధికారులకు సమర్పించిన నివేదికల ప్రకారం వేలమంది డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఒక్క రోడ్ ఐలాండ్‌లోనే సుమారు 1,873 మంది ప్రభావితమైనట్లు సమాచారం.

ప్రభావితమైన వారికి 90 రోజుల పాటు ఉచితంగా క్రెడిట్ మానిటరింగ్, ఫ్రాడ్ సహాయాన్ని అందిస్తున్నట్లు ఉబర్ తెలిపింది. ఇప్పటివరకైతే లీకైన సమాచారం దుర్వినియోగమైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని కంపెనీ స్పష్టం చేసింది. కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని పెంచే క్రమంలో ఉబర్ ఈ ఏడాది జులైలో కస్టమర్ సర్వీస్ విభాగంలో 10 శాతం మంది ఉద్యోగులను తగ్గించిన విషయం తెలిసిందే.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

UberUber data breachFireworks AI leakUber driver data exposedCyber security breachDriver license details leak

More Telugu News

ఐదేళ్ల కష్టానికి దక్కిన గుర్తింపు.. భార్య మౌనికను చూసి గర్వపడుతున్నానన్న మంచు మనోజ్

14 Nov, 13:43

గిగ్‌ వర్కర్లకు అండగా ఉంటాం.. ప్రతి డెలివరీపై 1 శాతం నగదు జమ: రాహుల్ గాంధీ

14 Nov, 13:42

వైభవ్ సూర్యవంశీ మరో సంచలనం.. 15 ఏళ్లకే కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు

14 Nov, 13:30

యువతను వెంటాడుతున్న కంటి సమస్యలు.. ప్రధాన కారణం అదేన‌ట‌!

14 Nov, 13:23

36 గంటల నిరీక్షణకు తెర.. మైక్రోసాఫ్ట్‌ సేవలన్నీ మళ్లీ అందుబాటులోకి

14 Nov, 13:09

చిరుకు కథ చెప్పిన త్రివిక్రమ్.. డీవీవీ బ్యానర్‌లో భారీ ప్రాజెక్ట్!

14 Nov, 13:06

విదేశాల్లో భారత ప్రతిష్టను రాహుల్ గాంధీ దెబ్బతీస్తున్నారు: ఈటల రాజేందర్

14 Nov, 13:03

తొలి ఓవర్‌లోనే ఎందుకు ఔటవుతున్నాడు? రోహిత్‌ లోపాన్ని బయటపెట్టిన కైఫ్‌

14 Nov, 13:02

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్

14 Nov, 12:37

కోస్తాంధ్రకు తుపాను హెచ్చరిక.. 18 నుంచి భారీ వర్షాలు!

14 Nov, 12:35

తెలంగాణ గిగ్‌ వర్కర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.5 లక్షల బీమా, రూ.10 లక్షల వైద్యం

14 Nov, 12:34

ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ

14 Nov, 12:32

దంచికొట్టిన సూర్య‌కుమార్‌.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం

14 Nov, 12:30

నిన్ననే ప్రపంచం అంతమవ్వాల్సింది.. 1960లో శాస్త్రవేత్తల సంచలన అంచనా ఇదే!

14 Nov, 12:29
..More Telugu News