తిరుమలలో భక్తుల రద్దీ.. నిన్న ఒక్కరోజే రూ.4.92 కోట్ల హుండీ ఆదాయం

Andhra
Advertisement
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం
  • శిలాతోరణం వరకు విస్తరించిన క్యూలైన్లు
తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తుండటంతో కొండపై భారీ రద్దీ కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన వివరాల ప్రకారం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయాయి. దీంతో క్యూలైన్లు వెలుపల శిలాతోరణం వరకు ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో, సర్వదర్శనం కోసం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్ల‌డించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఇక‌, నిన్న ఒక్కరోజే 70,124 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 32,298 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.92 కోట్ల ఆదాయం లభించగా, మొత్తం 4.03 లక్షల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. వారాంతం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

TirumalaTirupati Balaji TempleTTD Hundi IncomeTirumala Devotee RushLord Venkateswara SwamyTirumala Darshan Waiting Time

More Telugu News

ప్రయాణికులు దిగుతుండగా ప్ర‌మాదం.. భారీ ట్యాంకర్ ఢీకొట్టడంతో నీట మునిగిన అమెరికన్ విహార నౌక

14 Nov, 11:58

శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం.. భక్తుడిని అదుపులోకి తీసుకున్న ఎస్పీఎఫ్

14 Nov, 11:55

హసీనాను వెనక్కి పంపేందుకు భారత్‌ సిద్ధం.. కానీ ఆ రెండు హామీలు ఇస్తేనే..?

14 Nov, 11:53

9 రోజుల్లో రూ.1,110 కోట్లు.. ‘ఛావా’ రికార్డు బద్దలు కొట్టిన రామాయణ!

14 Nov, 11:23

రామ్‌లీలా మైదానంలో నిరసనలపై కొత్త రూల్స్.. 50 వేల మందికే అనుమతి, టైమ్ లిమిట్!

14 Nov, 11:22

తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి: కేటీఆర్

14 Nov, 11:19

గిద్దలూరులో మాజీ జవానుకు హనీట్రాప్

14 Nov, 11:18

టాయిలెట్‌కు వెళ్లినా ఉద్యోగులపై నిఘా.. చివరకు గోదాముల్లోనే మలవిసర్జన

14 Nov, 10:51

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్లాన్.. ఐఫోన్, బైక్ కోసం తాతను చంపిన మనవరాలు!

14 Nov, 10:49

బరువు కాదు, పొట్టచుట్టూ కొవ్వే ప్రమాదం... భారతీయుల్ని వెంటాడుతున్న 'లీన్ డయాబెటిస్'!

14 Nov, 10:47

పాక్ వెళ్లేందుకు పంజాబ్ సీఎంకు కేంద్రం అనుమతి కష్టమే

14 Nov, 10:47

టీమిండియాలో అనూహ్య మార్పు.. టెస్టు జట్టులోకి గుర్నూర్‌ బ్రార్‌.. కుల్దీప్‌ విడుదల

14 Nov, 10:41

సచిన్ చెత్త రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ

14 Nov, 10:39

బాలల దినోత్సవం: శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్

14 Nov, 10:38
..More Telugu News