Advertisement

నాలుగో వన్డేకు కొత్త టీమిండియా.. కెప్టెన్ గా అయ్యర్‌.. టీమ్ లో కీలక మార్పులు!

Sports
Advertisement
  • గిల్‌ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ తొలిసారి వన్డేల్లో కెప్టెన్సీ
  • రాహుల్‌, కాంబోజ్‌ కూడా దూరం కావడంతో ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మకు అవకాశాలు
  • బౌలింగ్‌లో సిరాజ్‌, కుల్దీప్‌కు చోటు దక్కే ఛాన్స్‌
  • సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత్‌
  • న్యూజిలాండ్‌ జట్టులోనూ పలు కీలక మార్పులు
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కైవసమే లక్ష్యంగా టీమిండియా నాలుగో మ్యాచ్‌కు సిద్ధమైంది. శుక్రవారం మౌంట్‌ మాంగనూయిలోని బే ఓవల్‌ వేదికగా జరగనున్న ఈ పోరులో భారత్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వం వహించనున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ టెస్టు సిరీస్‌ సన్నాహాల కోసం వెళ్లడంతో అతడికి ఈ బాధ్యతలు దక్కాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. గిల్ నాయకత్వంలో వన్డే టీమ్ ను తొలి మూడు మ్యాచ్ లకు మాత్రమే ఎంపిక చేశారు. ఇప్పుడు మిగతా రెండు మ్యాచ్ లలో భారత్ కు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తాడు.

గిల్‌తో పాటు కేఎల్‌ రాహుల్‌, అన్షుల్‌ కాంబోజ్‌ కూడా నాలుగో వన్డేకు అందుబాటులో ఉండరు. వీరి స్థానాల్లో తిలక్‌ వర్మ, కుమార్‌ కుశాగ్ర, యశ్‌ ఠాకూర్‌ జట్టులో చేరారు. తొలి మూడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన ఇషాన్‌ కిషన్‌ ఈసారి తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్‌ శర్మతో కలిసి అతడు ఓపెనింగ్‌ చేసే అవకాశముంది. రాహుల్‌ స్థానంలో వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు కూడా ఇషానే చేపట్టే ఛాన్స్‌ ఉంది.

ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు తిలక్‌ వర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌ మధ్య పోటీ నెలకొంది. తిలక్‌ ఈ పర్యటనలో ఇప్పటికే టీ20 మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఇండియా-ఏ తరఫున న్యూజిలాండ్‌-ఏతో జరిగిన అనధికారిక టెస్టులో హాఫ్‌ సెంచరీ చేశాడు. గైక్వాడ్‌కు కూడా గతంలో వన్డేల్లో మిడిలార్డర్‌లో ఆడిన అనుభవం ఉంది.

మహమ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌ తొలి మూడు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేదు. కాంబోజ్‌ దూరం కావడంతో వీరిలో ఒకరికి అవకాశం లభించనుంది. అర్ష్‌దీప్‌ సింగ్‌, గుర్నూర్‌ బ్రార్‌, ఆకిబ్‌ నబీలలో ఒకరికి విశ్రాంతి ఇస్తే సిరాజ్‌, కుల్దీప్‌ ఇద్దరికీ చోటు దక్కవచ్చు.

మరోవైపు న్యూజిలాండ్‌ జట్టులోనూ పలువురు కీలక ఆటగాళ్లు టెస్టు సన్నాహాల కోసం వన్డే సిరీస్‌ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆ జట్టు కొత్త కూర్పుతో బరిలోకి దిగనుంది.

మ్యాచ్‌ వివరాలు: నవంబర్‌ 13, శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభం. సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం, సోనీ లివ్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ ఉంటుంది.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Shreyas IyerIndia vs New Zealand 4th ODIIndia ODI squad changesIshan Kishan Rohit SharmaTilak Varma India debutMount Maunganui ODI match

More Telugu News

యూపీ ఎన్నికల్లో కొత్త కూటమి.. చేతులు కలిపిన ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్

12 Nov, 15:41

2047 వరకు వేచి చూడాల్సిన పనిలేదు.. అంతకంటే ముందే వికసిత భారత్: ప్రధాని మోదీ

12 Nov, 15:38

జియో తరహాలోనే గ్రీన్ ఎస్‌ఎమ్ వ్యూహం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

12 Nov, 15:36

మీర్‌పేటలో దారుణం.. మహిళను హతమార్చి బంగారు ఆభరణాల దోపిడీ.. తెలిసిన వారే చంపారా?

12 Nov, 15:32

ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే సహించేది లేదు.. మంత్రి పొన్నం హెచ్చరిక

12 Nov, 15:29

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. 15 నాటికి వాయుగుండం!

12 Nov, 15:28

సత్తా చాటుతున్న ఆసీస్ యువ సంచలనం.. సీజన్‌లో మూడో సెంచరీతో టెస్టు రేసులోకి శామ్ కాన్‌స్టాస్

12 Nov, 15:15

కరీనా కపూర్ ధరించిన లాకెట్‌పై వివాదం.. అండగా నిలిచిన హిందూ సంస్థ

12 Nov, 15:08

ముంబై లోకల్ రైలులో దారుణం.. వేధింపులను ప్రతిఘటించిన యువతిని తోసేయడంతో తెగిపడిన చేయి!

12 Nov, 14:52

'పుష్పక విమానం' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

12 Nov, 14:51

ఏపీలో పెండింగ్‌లో ఉన్న 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

12 Nov, 14:48

అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుమార్తెకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు

12 Nov, 14:38

అల్లరి నరేశ్‌ ‘ఆల్కహాల్‌’ విడుదల తేదీ ఖరారు.. సత్యతో కలిసి కామెడీ పంచేందుకు రెడీ

12 Nov, 14:35

ఐరన్ మ్యాన్ స్ఫూర్తితో 'జార్విస్'.. ఇంటర్నెట్ లేకుండానే పనిచేసే స్మార్ట్ రూమ్.. భారతీయ కుర్రాడి అద్భుత సృష్టి!

12 Nov, 14:12
..More Telugu News