సీఐఐ సదస్సులో ఏపీపై పారిశ్రామికవేత్తల ప్రశంసల జల్లు.. కియా రూ. 18 వేల కోట్ల పెట్టుబడి ప్రకటన
Advertisement
- ఏపీలో రూ. 18 వేల కోట్లతో ప్లాంట్ విస్తరణకు కియా నిర్ణయం
- ఇది 'ఈజ్' కాదు, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అని జీఎంఆర్ ప్రశంస
- భోగాపురం విమానాశ్రయం ఏపీకి ఎకనామిక్ ఇంజన్‌గా మారుతుందన్న జీఎం రావు
- మహారాష్ట్ర నా జన్మభూమి అయితే, ఏపీ నా భాగ్య భూమి అన్న సాగర్ డిఫెన్స్ సీఈఓ
- సీఐఐ సదస్సు వేదికగా ఏపీ ప్రభుత్వ విధానాలపై పారిశ్రామికవేత్తల కితాబు
పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తున్న తీరుపై పారిశ్రామిక దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ప్రభుత్వ విధానాలు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయని కొనియాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో తమ భవిష్యత్ ప్రణాళికలను, భారీ పెట్టుబడుల వివరాలను ప్రకటించారు. కియా, జీఎంఆర్, సాగర్ డిఫెన్స్ వంటి సంస్థల అధినేతలు ఏపీ ప్రభుత్వ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.
రూ. 18 వేల కోట్లతో విస్తరణ: కియా ఇండియా
కియా ఇండియా సీఈఓ, ఎండీ గ్వాంగ్ లీ మాట్లాడుతూ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విజయానికి ఏపీలోని కియా పరిశ్రమే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. "ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఏపీ ప్రభుత్వంపై ఉన్న పూర్తి భరోసాతోనే మేం భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాం. ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌ను విస్తరించి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించాం. ఇందుకోసం రూ. 18 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాం. ఈ విస్తరణ ద్వారా ప్రత్యక్షంగా 12 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి" అని ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం ఏటా 4 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తూ, ఏపీ ఆటోమొబైల్ ఎకో సిస్టమ్‌కు కియా అండగా నిలుస్తోందని తెలిపారు. ఇక్కడ తయారైన కార్లను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ, 'మేక్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నామని గర్వంగా చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సుస్థిర ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలోనూ భాగస్వాములమవుతామని ఆయన స్పష్టం చేశారు.
ఇది 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్': జీఎంఆర్ గ్రూప్
జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ.. ఏపీలో 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' మాత్రమే కాదని, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నడుస్తోందని ప్రశంసించారు. "ఒక పెట్టుబడిదారుడిగా చెబుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. భోగాపురం విమానాశ్రయం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ఒక ప్రధాన ఆర్థిక చోదక శక్తిగా (ఎకనామిక్ ఇంజన్) మారుతుంది. గతంలో మేం శంషాబాద్ విమానాశ్రయం గురించి ఆలోచించి నిర్మించడం వల్లే, ఇప్పుడు అది తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అదే తరహాలో భోగాపురం ఏపీకి కీలకం కానుంది" అని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు జీఎంఆర్ గ్రూప్ ఒక ఏరోసిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఏపీ నా భాగ్య భూమి: సాగర్ డిఫెన్స్
సాగర్ డిఫెన్స్ సీఈఓ నికుంజ్ పరాశర్ మాట్లాడుతూ.. "మహారాష్ట్ర నా జన్మభూమి అయితే, ఆంధ్రప్రదేశ్ నా భాగ్య భూమి" అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. మారిటైమ్ టెక్నాలజీ రంగంలో ఐదో పారిశ్రామిక విప్లవం రాబోతోందని సీఎం చంద్రబాబు తరచూ చెబుతుంటారని, ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందని అన్నారు. అందుకే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చామని తెలిపారు. రక్షణ రంగంలో స్థానిక యువతను భాగస్వాములను చేస్తూ 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యం దిశగా తమ సంస్థ ముందుకు వెళుతోందన్నారు. తీరప్రాంత రక్షకులైన మత్స్యకారుల కోసం ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా సంపద సృష్టించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు.