అరకు కాఫీ రుచి చూసిన పీయూష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సీఐఐ సదస్సు ఫొటోలు ఇవిగో!
Advertisement
- ఏపీ పెవిలియన్‌ను సందర్శించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్
- కేంద్రమంత్రికి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు వివరించిన సీఎం చంద్రబాబు
- సీఎం, డిప్యూటీ సీఎం పవన్‌తో కలిసి పెవిలియన్‌ను పరిశీలించిన గోయల్
- రాష్ట్ర కళలు, సంస్కృతిని ప్రతిబింబించే స్టాళ్లను ఆసక్తిగా తిలకించిన నేతలు
- అరకు కాఫీని కలిసి ఆస్వాదించిన పీయూష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి ప్రణాళికలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ఈ పెవిలియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు వారికి వివరించారు.
ముఖ్యంగా, తిరుపతి, విశాఖపట్టణం, అమరావతి ఎకనమిక్ రీజియన్లలో జరుగుతున్న ప్రగతిపై అధికారులు డిజిటల్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. సీఆర్డీఏ పరిధిలో చేపడుతున్న పనులు, విశాఖపట్నం అభివృద్ధి ప్రణాళికలపై ప్రత్యేకంగా వివరించారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సైతం నేతల దృష్టికి తీసుకెళ్లారు. పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అధికారులు స్పష్టం చేశారు.
అనంతరం పెవిలియన్‌లోని సాంస్కృతిక ప్రదర్శనలను నేతలు ఆసక్తిగా తిలకించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఏర్పాటు చేసిన కళాకృతుల వద్ద కేంద్రమంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫొటోలు దిగారు. గిరిజనులు రూపొందించిన చిత్రాలను ప్రత్యేకంగా పరిశీలించి, కేంద్రమంత్రి, సీఎం స్వయంగా నమూనా చిత్రాలను తీర్చిదిద్దడం విశేషం. తోలుబొమ్మలాట, పెన్ కలంకారీ వంటి కళారూపాల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ కళాకారులు, వారి నైపుణ్యాల గురించి సీఎం చంద్రబాబు కేంద్రమంత్రికి వివరించారు.
పర్యటనలో భాగంగా, అరకు కాఫీ స్టాల్ వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అరకు కాఫీని రుచి చూశారు. కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం సదస్సు ప్రాంగణంలో కేంద్రమంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం బ్యాటరీ కారులో కలిసి ప్రయాణించారు. ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారానికి, బలమైన బంధానికి నిదర్శనంగా నిలిచింది.