పంచాయతీ నిధులను పప్పుబెల్లాల్లా వాడేశారు: వైసీపీపై అశోక్ బాబు ఫైర్

Andhra
Advertisement
  • గ్రామీణ వ్యవస్థను జగన్ నాశనం చేశారన్న అశోక్ బాబు
  • కేంద్రం ఇచ్చిన పంచాయతీ నిధులను జగన్ దారి మళ్లించారని ఆరోపణ
  • కూటమి ప్రభుత్వం రాగానే రైతుల బకాయిలు చెల్లించామని వెల్లడి
Advertisement
గత వైసీపీ ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను సర్వనాశనం చేసిందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీల కోసం ఇచ్చిన కోట్ల రూపాయల నిధులను జగన్ దారి మళ్లించి పప్పుబెల్లాల్లా పంచిపెట్టారని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా గ్రామాల్లో నిధులు లేకుండా చేసిన పాపం జగన్‌దేనని మండిపడ్డారు.

ఇంటింటికీ చెత్త పన్ను వేసి ప్రజలను పీడించారని, పన్ను కట్టనివారికి పింఛన్లు ఆపేస్తామని బెదిరించారని అశోక్ బాబు గుర్తుచేశారు. రూ. 3,000 కోట్ల ఉపాధి హామీ నిధులను వైసీపీ కార్యకర్తలు దోచుకున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యం బ్రాండ్లతో గ్రామీణ ప్రజల జేబులు గుల్ల చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారని అన్నారు.

అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గత ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన రూ.1,600 కోట్ల ధాన్యం బకాయిలను వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టామని, మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని... రేపటి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో కూడా కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని అశోక్ బాబు ధీమా వ్యక్తం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Ashok BabuYS Jagan Mohan ReddyYSRCPPanchayat FundsAndhra Pradesh PoliticsMGNREGA Funds

More Telugu News

ప్రపంచ మార్కెట్లు ఢమాల్‌.. భారత సూచీలు మాత్రం రయ్‌ రయ్‌: కారణాలివే..!

06 Nov, 16:54

సైబర్ సెక్యూరిటీలో సంచలనం.. హ్యాకర్లను మించిపోయే 'జీపీటీ-6' లాంచ్ చేసిన ఓపెన్ఏఐ

06 Nov, 16:50

కొచ్చి దాడి కేసులో అనూహ్య మలుపు.. బాధితుడైన డాక్టర్‌పైనే రేప్ కేసు!

06 Nov, 16:49

గోవా నుంచి బెంగాల్ వెళుతూ విశాఖలో ఆగిన హోవర్‌క్రాఫ్ట్‌లు.. చూసేందుకు జనం క్యూ!

06 Nov, 16:36

'రామాయణ'పై రకుల్ ప్రీత్ సింగ్ భావోద్వేగం

06 Nov, 16:27

టపాసుల శబ్దం 125 డెసిబుల్స్‌.. చెవులకు ఎంత మోతాదు ప్రమాదకరం? దీపావళి వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

06 Nov, 16:22

మోదీతో సూర్యకుమార్ యాదవ్ భేటీ.. 'రామ్, సరయూ' అంటూ ప్రధాని ట్వీట్

06 Nov, 16:18

సాధారణ ఉప్పుకు బదులు ఇది వాడితే.. లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! 'నేచర్ హెల్త్' కీలక అధ్యయనం

06 Nov, 16:14

భార్య హత్యాయత్నం వెనుక చాట్‌జీపీటీ?.. ఓపెన్ఏఐపై కోర్టుకెక్కిన భర్త!

06 Nov, 15:47

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలకు మంటలు.. ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు!

06 Nov, 15:44

చిరంజీవి 'కాకా'పై పుకార్లకు చెక్.. సంక్రాంతికి రిలీజ్ పక్కా: కోన వెంకట్

06 Nov, 15:42

ముంబైలో మళ్ళీ బాంబు బెదిరింపులు.. అమితాబ్ బంగ్లా సహా పలు ప్రాంతాలు టార్గెట్!

06 Nov, 15:24

బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే.. రైతులతో ముఖాముఖి

06 Nov, 15:21

కోహ్లీ 100 సెంచరీల కల నెరవేరేనా? 2027 ప్రపంచకప్‌ లోపు కష్టమంటున్న మాజీ కోచ్‌!

06 Nov, 15:18
..More Telugu News