డంపింగ్ యార్డ్ కాలుష్యంపై నిరాహార దీక్ష చేస్తా: మల్లారెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డంపింగ్ యార్డ్ కాలుష్యంపై నిరాహార దీక్ష చేస్తా: మల్లారెడ్డి

Malla Reddy to go on hunger strike over Jawahar Nagar dumping yard issue
  • జవహర్ నగర్ డంప్ యార్డ్‌పై ఆమరణ దీక్ష చేస్తానన్న మల్లారెడ్డి
  • రోజుకు ఇద్దరు అనుమానాస్పదంగా చనిపోతున్నారని ఆవేదన
  • డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలని డిమాండ్
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా త్వరలోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు. జవహర్ నగర్‌పై ఓ అమెరికన్ యూనివర్సిటీ విడుదల చేసిన సర్వే ఫలితాలు తనను తీవ్రంగా కలచివేశాయని అన్నారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. "జవహర్ నగర్ నా నియోజకవర్గంలో ఉంది. అది నా గుండెకాయ. ప్రపంచంలోనే అత్యధికంగా మీథేన్ విషవాయువులు విడుదలవుతున్న ప్రాంతాల్లో జవహర్ నగర్ 4వ స్థానంలో ఉందని సర్వే చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో రోజుకు కనీసం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు. వారి మృతికి కారణాలు తెలియడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించాలని మల్లారెడ్డి కోరారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. 2006లో డంపింగ్ యార్డ్ నిర్వహణకు రాంకీ సంస్థతో ఒప్పందం జరిగిందని, కానీ ఆ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం విషవలయంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు.
Advertisement
Malla Reddy
Jawahar Nagar Dumping Yard
Hunger Strike
Methane Gas Emissions
Eatala Rajender
Medchal Malkajgiri News

More Telugu News