అమెరికాలో దక్షిణాసియన్లపై పెరిగిన విద్వేషం.. అగ్రరాజ్యంలో పెచ్చుమీరిన జాతి వివక్షపై పోరాడాలన్న రాజా కృష్ణమూర్తి
- అమెరికాలో దక్షిణాసియన్లపై ఆన్‌లైన్ విద్వేషంపై అధ్యయనం
- 'ఎక్స్'లో నెలవారీగా 240 శాతం పెరిగిన ద్వేషపూరిత పోస్టులు
- జాతి వివక్షపై గళం విప్పాలని రాజకీయ పార్టీలకు కాంగ్రెస్‌మెన్ రాజా కృష్ణమూర్తి పిలుపు
- కొందరు రాజకీయ నాయకుల వ్యాఖ్యలే విద్వేషానికి కారణమని ఆరోపణ
- 18 నెలల్లో వెలుగులోకి 5.42 లక్షలకు పైగా ద్వేషపూరిత పోస్టులు
అమెరికాలో దక్షిణాసియా దేశాలకు చెందిన వారిపై ఆన్‌లైన్‌లో విద్వేష ప్రచారం భారీగా పెరిగిపోవడంపై భారత-అమెరికన్ కాంగ్రెస్‌మెన్ రాజా కృష్ణమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలోని 'సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్' అనే పరిశోధన సంస్థ విడుదల చేసిన నివేదిక ఆధారంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ అధ్యయనం ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్)లో దక్షిణాసియన్లను లక్ష్యంగా చేసుకుని పోస్ట్ చేసే ద్వేషపూరిత పోస్టుల సంఖ్య నెలవారీగా 240 శాతం పెరిగింది. 2025 జనవరి నుంచి 2026 జూన్ మధ్య 18 నెలల కాలంలో దాదాపు 5,42,360 విద్వేషపూరిత పోస్టులను గుర్తించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. వీటిలో 45 శాతం పోస్టులు దక్షిణాసియన్లను ఆక్రమణదారులుగా, అమెరికన్ల ఉద్యోగాలను దొంగిలించేవారిగా, దేశ జనాభాకు ముప్పుగా చిత్రీకరించేవిగా ఉన్నాయని రాజా కృష్ణమూర్తి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
ఈ గణాంకాలపై స్పందించిన రాజా కృష్ణమూర్తి.. "దక్షిణాసియన్లపై నెలవారీగా 240 శాతం పెరిగిన ద్వేషపూరిత ప్రచారం ఎక్కడి నుంచో ఊడిపడలేదు" అని అన్నారు. కొందరు రాజకీయ నాయకులు, ముఖ్యంగా ట్రంప్ అవలంబించిన విధానాలు, చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఈ తరహా విద్వేష వాతావరణానికి కారణమయ్యాయని ఆయన ఆరోపించారు.
"అమెరికాలోని ప్రతీ వర్గానికి చెందిన ప్రజలు, రెండు పార్టీల నాయకులు జాతి వివక్ష, జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఎక్కడైనా సరే గళం విప్పాలి. దక్షిణాసియా అమెరికన్లు కూడా ఇతరుల మాదిరిగానే అమెరికాలో అంతర్భాగం. ఈ దేశానికి మేము చేసిన సేవలను, అందించిన తోడ్పాటును ఎంతటి ద్వేషమైనా చెరిపివేయలేదు" అని ఆయన స్పష్టం చేశారు.
వలస రాజకీయాలు, ఆర్థిక అసూయ, రాజకీయ నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాలు వంటివి ఈ విద్వేషం పెరగడానికి ప్రధాన కారణాలని అధ్యయనం పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. ఇల్లినాయిస్ 8వ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రాటిక్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రాజా కృష్ణమూర్తి, అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవాస భారతీయుల సమస్యలపై తరచూ తన గళాన్ని వినిపిస్తుంటారు.