బెంగాలీ భాషలో హారర్ థ్రిల్లర్ గా రూపొందిన వెబ్ సిరీస్ 'నిఖోష్ ఛాయా'. బెంగాలీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై సీజన్ 1 .. సీజన్ 2 గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఒక్కో సీజన్ లో 6 ఎపిసోడ్స్ ను వదిలారు. హిందీలో ఈ సిరీస్ ను 'అంజాన్ సాయే' పేరుతో 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కి తెచ్చారు. తెలుగులోను ఇప్పుడు ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. మొదటి సీజన్ కి పరమబ్రత చటోపాధ్యాయ్ దర్శకత్వం వహించగా, రెండవ సీజన్ కి సయంతన్ ఘోషల్ దర్శకత్వం వహించాడు.
నవీన్ కార్తీక్ కి కొన్నేళ్లుగా క్షుద్ర విద్యాలపై ఒక అవగాహన ఉంటుంది. దుష్ట ప్రయోగాల బారిన పడిన వారిని ఆయన దైవబలంతో రక్షిస్తూ ఉంటాడు. క్షుద్ర విద్యల ప్రమేయం ఉన్న కేసులకు సంబంధించిన విషయాలలో పోలీసులు ఆయన సలహాలను .. సూచనలను తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి సమీపంలోని అడవిలో ఒక మాంత్రికుడు క్షుద్రపూజలు చేస్తున్నాడనే వార్త గుప్పుమంటుంది. వెంటవెంటనే ముగ్గురు యువతుల 'నరబలి' జరగడంతో జనం భయపడిపోతారు.
పోలీస్ ఆఫీసర్ అభిషేక్ తో కలిసి 'నరబలి' జరిగిన ప్రదేశాలను నవీన్ కార్తీక్ పరిశీలన చేస్తాడు. చంద్రగ్రహణం దగ్గర పడుతూ ఉండటంతో, క్షుద్రమాంత్రికుడు తన శక్తులను పెంచుకోవడం కోవడం కోసం ఇలా నరబలి ఇస్తున్నాడనే విషయం నవీన్ కార్తీక్ కి అర్థమవుతుంది. దాంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరిస్తాడు. అయినా కానిస్టేబుల్ బాబు కూతురు సునీత కనిపించకుండా పోతుంది. దాంతో ఆమె జాడ తెలుసుకోవడానికి పోలీస్ డిపార్టుమెంట్ తో పాటు నవీన్ కార్తీక్ రంగంలోకి దిగుతాడు.
క్షుద్రమాంత్రికుడి బారి నుంచి సునీతను కాపాడాలనే పట్టుదలతో అందరూ గాలింపు జరుపుతూ ఉండాగానే, పోలీస్ ఆఫీసర్ అభిషేక్ భార్య 'రీతూ' అదృశ్యమవుతుంది. ఆమెను కూడా మాంత్రికుడే అపహరించాడనే విషయం అర్థమవుతుంది. మాంత్రికుడు ఎవరో .. అతని శక్తి ఏమిటో .. .. అడవిలో అతని స్థావరం ఎక్కడుందో తెలుసుకోవాలని నవీన్ కార్తీక్ భావిస్తాడు. అందుకోసం ఆయన ఏం చేస్తాడు? ఆ ప్రయత్నంలో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? మాంత్రికుడి బారి నుంచి సునీత .. 'రీతూ'లను ఆయన కాపాడగలుగుతాడా? అనేది మిగతా కథ.
కొంతమంది మాంత్రికులు క్షుద్ర విద్యలను నేర్చుకుంటారు. అలా నేర్చుకున్న విద్యల ద్వారా మరిన్ని శక్తులను పొందాలని ఆరాటపడుతూ ఉంటారు. అందుకోసం నరబలి మార్గాన్ని ఎంచుకుంటారు. మరికొంతమంది అందుకు విరుగుడు చేస్తూ, అందుకోసం దైవం సాయం కూడా తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఇద్దరు మాంత్రికుల చుట్టూ తిరిగే కథ ఇది. మంచికి .. చెడుకు మధ్య జరిగే పోరాటంగా ఈ కథ నడుస్తుంది.
క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని కథలలో, క్షుద్ర ప్రయోగాలకు సంబంధించిన సన్నివేశాలు అప్పుడప్పుడు మాత్రమే తెరపైకి వస్తుంటాయి. కానీ ఈ సిరీస్ లో 80 శాతం వరకూ క్షుద్రపూజలు .. అందుకు సంబంధించిన తతంగం కనిపిస్తాయి. వరుసగా జరుగుతున్న నరబలులు .. అందుకు కారకులైనవారిని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ మాంత్రికుడి క్షుద్రపూజలకు చెక్ పెట్టడానికి పోలీస్ వారు నవీన్ కార్తీక్ సాయం తీసుకోవడంతో కథ పుంజుకుంటుంది.
మాంత్రికుడి ఫ్లాష్ బ్యాక్ .. అతని భార్య పిల్లలు .. అతణ్ణి ఆదరించిన చిత్ర .. అతను ఆరాధించిన చిత్ర .. క్షుద్ర మాంత్రికుడికి .. అతని ఆగడాలను నిలువరించే మాంత్రికుడికి మధ్య గల సంబంధం తాలూకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగానే అనిపిస్తాయి. సీజన్ 1 క్లైమాక్స్ .. సీజన్ 2ను మొదలు పెట్టిన విధానం .. సీజన్ 2 క్లైమాక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. కాకపోతే నరబలికి సంబంధించిన సన్నివేశాలు మాత్రం జుగుప్సాకరంగా అనిపిస్తూ ఇబ్బంది పెడతాయి.
ఒక స్వార్థపరుడైన క్షుద్ర మాంత్రికుడు తన శక్తులను పెంచుకోవడం కోసం నరబలి చేస్తూ వెళ్లడం .. మరో మాంత్రికుడు అతని ఆగడాలను అడ్డుకోవడానికి తనవంతు ప్రయత్నం చేయడం వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. అదే తరహాలో ఎలాంటి కొత్తదనం లేకుండా సాగిన కంటెంట్ గా ఈ సిరీస్ కనిపిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ మాత్రం ఈ కంటెంట్ కి గట్టి సపోర్టునే ఇచ్చాయి.
ఈ సిరీస్ కి సంబంధించిన 12 ఎపిసోడ్స్ అందుబాటులోనే ఉన్నాయి. కథాకథనాలు రొటీన్ గా అనిపించినప్పటికీ, ఒక్కో ఎపిసోడ్ నిడివి మరీ ఎక్కువగా లేకపోవడం వలన పెద్దగా బోర్ అనిపించదు. అందువలన కాస్త తీరిక చేసుకుంటే ఈ సిరీస్ లోని రెండు సీజన్లను ఒకేసారి చూసేయవచ్చు. హారర్ సినిమాలను .. సిరీస్ లను ఇష్టపడేవారికి ఓ మాదిరిగా అనిపించవచ్చు.

Movie Details
Movie Name: Anjaan Saaye
Genre: Horror, Thriller
Release Date: 2026-10-23
Cast: Chiranjeeth Choudary, Gourav Chakrabarthy, Kanchan Mallik, Surangana Bandyopadhyay
Director: Sayanthan Ghosel
PRO: -
Music: -
Banner: A Follow Focus Films
Review By: Peddinti