- మూడో టీ20లో భారత్‌కు 199 పరుగుల లక్ష్యం
- కీలక ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన డారిల్ మిచెల్
- 52 బంతుల్లో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచిన మిచెల్
- భారత బౌలర్లలో అర్ష్‌దీప్, అక్షర్, నితీశ్‌లకు చెరో వికెట్
భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. వెల్లింగ్టన్‌లోని హెన్రీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డారిల్ మిచెల్ చెలరేగడంతో, కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలోనే కివీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 1.2 ఓవర్లలో కేవలం 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్, ఓపెనర్ ఫిన్ అలెన్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నమన్ ధీర్ విడదీశాడు. 25 బంతుల్లో 40 పరుగులు చేసిన ఫిన్ అలెన్, లాంగ్ ఆన్‌లో నమన్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగాడు. అయినప్పటికీ మిచెల్ తన జోరును కొనసాగించాడు. చివరి వరకు క్రీజులో నిలిచి 52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయంగా 89 పరుగులు చేశాడు. దీంతో కివీస్ స్కోరు 200 పరుగులకు చేరువైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి, 33 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అలాగే అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి కూడా చెరో వికెట్ పడగొట్టారు