- కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ప్రస్తావిస్తోందన్న ఫరూక్ అబ్దుల్లా
- అందువల్లే ఆ ప్రాంతానికి రక్షణ లభిస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
- ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను తప్పుబట్టిన మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్
- పాకిస్థాన్ భారత్‌తో పాటు జమ్మూ కశ్మీర్ ప్రజలకు కూడా శత్రువని స్పష్టీకరణ
- పీఓకే పరిస్థితులను చూసి కశ్మీర్ ప్రజలకు పాక్ రక్షణగా నిలుస్తోందని ఎలా చెప్పగలరని ప్రశ్న
కశ్మీర్‌పై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ తప్పుబట్టారు. ఫరూక్‌పై తనకు గౌరవం ఉందని, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు సరికావని స్పష్టం చేశారు. పాకిస్థాన్ భారత్‌తో పాటు జమ్మూ కశ్మీర్ ప్రజలకు కూడా శత్రువని అన్నారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలు తమ హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్నారని ఆజాద్ గుర్తుచేశారు. అక్కడి పరిస్థితులను చూస్తే పాకిస్థాన్ కశ్మీర్ ప్రజలకు రక్షణగా నిలుస్తోందని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. 1947 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి కృషి చేశాయని పేర్కొన్నారు.
ఫరూక్ అబ్దుల్లా శనివారం బారాముల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ప్రస్తావించడం వల్లే ఆ ప్రాంతానికి రక్షణ లభిస్తోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి న్యాయం ఆశించగలమా? అని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్రంగా స్పందించారు. ఫరూక్‌పై పోలీసు చర్యలు తీసుకోవాలని భాజపా అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జమ్మూ కశ్మీర్ భాజపా అధ్యక్షుడు సత్ శర్మ కోరారు. మాజీ మంత్రి ఇమ్రాన్ అన్సారీ కూడా ఫరూక్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.