జర్మనీలో వింత కేసు.. యువతిని వేధించిన రోబో!
- జర్మనీలోని కొలోన్‌లో 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు
- ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్
- రోబోను, ఇద్దరు యువకుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
- యువకులపై లైంగిక వేధింపుల కింద క్రిమినల్ కేసు నమోదు
- రోబోను ఉద్దేశపూర్వకంగా నియంత్రించారా? అనే కోణంలో దర్యాప్తు
జర్మనీలో ఓ వింత, దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికపై ఓ రోబో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు యువకులపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి, రోబోను స్వాధీనం చేసుకున్నారు.
కొలోన్ నగరంలోని హోహెన్‌జోలెర్న్‌రింగ్ వీధిలో ఆదివారం రాత్రి 11:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ బయట తన స్నేహితులతో నిల్చుని ఉన్న బాలిక వద్దకు, వెనుక నుంచి సుమారు 1.2 మీటర్ల ఎత్తు ఉన్న రోబో వచ్చింది. ఆ రోబో బాలిక పిరుదులను తాకి, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానితులకు చెందిన కారు డిక్కీలో ఉన్న రోబోను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రోబో యజమాని అయిన 16 ఏళ్ల యువకుడు, అతని 19 ఏళ్ల స్నేహితుడు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిద్దరి మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు.
ఈ ఘటనపై లైంగిక వేధింపుల అనుమానంతో క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించినట్లు కొలోన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బాలికను వేధించాలనే ఉద్దేశంతోనే రోబోను రిమోట్‌తో నియంత్రించారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.