శ్రీశైలం ప్రాజెక్టుకు అంతర్జాతీయ ఖ్యాతి
- వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు చోటు
- ఇది తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్న గొట్టిపాటి రవి
- భారీ వరదలను తట్టుకున్న నిర్మాణ పటిష్ఠతకు దక్కిన గౌరవమని వ్యాఖ్య
శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రతిష్ఠాత్మకమైన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం లభించడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ అరుదైన గుర్తింపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. శ్రీశైలం కేవలం విద్యుదుత్పత్తి కేంద్రం మాత్రమే కాదని, లక్షలాది మందికి తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తున్న బహుళార్థసాధక ప్రాజెక్ట్ అని కొనియాడారు.
గతంలో భారీ వరదలను తట్టుకుని నిలబడిన శ్రీశైలం డ్యామ్ నిర్మాణ పటిష్ఠతకు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు రావడం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు ఇంజనీరింగ్ నైపుణ్యం, విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం, బహుముఖ ప్రయోజనాలకు ఈ పురస్కారం నిదర్శనమని వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టిని మంత్రి ప్రశంసించారు. పట్టిసీమ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్లే శ్రీశైలం నీటిని రాయలసీమకు సమర్థంగా వినియోగించుకోగలుగుతున్నామని తెలిపారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని సరఫరా చేయడంతో, శ్రీశైలం జలాలను రాయలసీమ అవసరాలకు వాడుకునేందుకు పూర్తి వెసులుబాటు కలిగిందని గొట్టిపాటి గుర్తుచేశారు. శ్రీశైలం జలాశయం ఇప్పటికీ రాయలసీమతో పాటు కృష్ణా డెల్టా రైతుల అవసరాలను తీరుస్తూ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.