నయనతార పొలిటికల్ ఎంట్రీపై ఆమె భర్త విఘ్నేశ్ శివన్ క్లారిటీ

నయనతార పొలిటికల్ ఎంట్రీపై ఆమె భర్త విఘ్నేశ్ శివన్ క్లారిటీ

Nayanthara husband Vignesh Shivan clarity on her political entry
  • నయనతార రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు
  • స్పష్టతనిచ్చిన భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్
  • ప్రస్తుతం కుటుంబం, కెరీర్‌కే తమ ప్రాధాన్యత అని వెల్లడి
తమిళనాడులో నటి నయనతార రాజకీయ ప్రవేశంపై జోరుగా సాగుతున్న ఊహాగానాలకు ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా కుటుంబం, పిల్లల పెంపకం, వృత్తిపరమైన పనులపైనే ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలోనే తాము సంతృప్తిగా ఉన్నామని పేర్కొంటూ, పరోక్షంగా రాజకీయ ప్రవేశ వార్తలను ఖండించారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా నటుడు విజయ్ బాధ్యతలు స్వీకరించి, పాలన సాగిస్తున్న నేపథ్యంలో.. నయనతార, త్రిష వంటి ప్రముఖ నటీమణులు కూడా రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా 2031 అసెంబ్లీ ఎన్నికల నాటికి నయనతార రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని కొందరు అంచనా వేస్తున్నారు.

ఈ ఊహాగానాలపై విఘ్నేశ్ శివన్ స్పందిస్తూ... ప్రస్తుతం తమకు కుటుంబ బాధ్యతలు, పిల్లల ఆలనాపాలన, వృత్తి జీవితమే ముఖ్యమని స్పష్టం చేశారు. మరోవైపు, నయనతార ప్రస్తుతం 'మూక్కుత్తి అమ్మన్ 2', 'డియర్ స్టూడెంట్స్', 'రక్కాయి' వంటి పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.

గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి సినీ ప్రముఖులు రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన చరిత్ర తమిళనాడుకు ఉంది. అయితే, నయనతార రాజకీయ ప్రవేశంపై ఆమె నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ ఊహాగానాలు కొనసాగే అవకాశం ఉంది.
Advertisement
Nayanthara
Vignesh Shivan
Nayanthara political entry
Tamil Nadu politics
Thalapathy Vijay
Nayanthara upcoming movies

More Telugu News