గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య.. పాక్‌ను కదిలించిన ఘటన.. రంగంలోకి ప్రధాని!
- హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తానని కన్సల్టెంట్ మోసం
- ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన లైబా ఇజాజ్ ఆత్మహత్య
- ఈ మోసంలో రూ.93 లక్షలు కోల్పోయిన బాధితురాలి కుటుంబం
- నకిలీ పత్రాలతో వీసా ఇంటర్వ్యూలో పట్టుబడటంతో తీవ్ర మనస్తాపం
- ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పాక్ ఏజెన్సీలు
ఒక దారుణమైన మోసం.. ఉన్నత విద్యా కలలు కన్న ఒక ప్రతిభావంతురాలైన విద్యార్థిని ప్రాణాలను బలిగొంది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలనే ఆశతో విద్యా కన్సల్టెంట్‌ను నమ్మి మోసపోయిన లైబా ఇజాజ్ (20) అనే గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించింది.
ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన లైబా, హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్, స్కాలర్‌షిప్ ఇప్పిస్తానని చెప్పిన ముహమ్మద్ నౌమాన్ అనే కన్సల్టెంట్‌ను ఆశ్రయించింది. ఇందుకు గాను లైబా కుటుంబం నుంచి అతడు ఏకంగా 93 లక్షల పాకిస్థానీ రూపాయలు (సుమారు 33-34 వేల డాలర్లు) వసూలు చేశాడు. ఇందులో 29 లక్షలు బ్యాంకు ద్వారా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరించాడు.
సర్గోధా ప్రాంతానికి చెందిన లైబా తండ్రి, 1994 నుంచి ఇస్లామాబాద్ వీధుల్లో పాలు, పెరుగు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. కూతురి ఉన్నత భవిష్యత్తు కోసం, ఇల్లు కట్టుకోవాలని కొన్న భూమిని సైతం అమ్మేశారు. తల్లి తన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టారు. ఇంతకుముందు సౌదీ అరేబియా నుంచి వచ్చిన స్కాలర్‌షిప్‌ను సైతం కాదనుకుని, హార్వర్డ్ లక్ష్యంగా లైబా ముందుకు సాగారు.
అయితే, నౌమాన్ ఇచ్చిన అడ్మిషన్ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు నకిలీవని అమెరికా వీసా ఇంటర్వ్యూలో తేలడంతో లైబా తీవ్ర కుంగుబాటుకు లోనయ్యారు. తన కుటుంబం పడిన కష్టమంతా వృథా అయిందనే ఆవేదనతో అక్టోబర్ 9న ఇస్లామాబాద్‌లోని జి-10 సెక్టార్‌లోని ఒక వీక్లీ మార్కెట్‌లో చెట్టుకు తన స్కార్ఫ్‌తో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. చనిపోయే ముందు తన మామతో మాట్లాడుతూ "ఈ విషయం నాన్నకు చెప్పకండి, తెలిస్తే ఆయన చనిపోతారు" అని వేడుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది.
ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. దీనిని "అత్యంత విషాదకరం" అని అభివర్ణించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) రంగంలోకి దిగి ప్రధాన నిందితుడు నౌమాన్‌ను అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఫాతిమా సర్వర్ అనే మరో మహిళపైనా చీటింగ్, ఇమ్మిగ్రేషన్ చట్టాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ, "ఇది మాకు ఒక టెస్ట్ కేస్" అని పేర్కొంటూ, బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.