నేడు ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబుతో కీలక భేటీ.. విజయ్ షెడ్యూల్ ఇదిగో!

నేడు ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబుతో కీలక భేటీ.. విజయ్ షెడ్యూల్ ఇదిగో!

CM Vijay visiting AP today for key meeting with Chandrababu Naidu here is the schedule
  • మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న విజయ్
  • 4.15 గంటలకు చంద్రబాబు నివాసంలో ఆయనతో భేేేటీ
  • గోదావరి-కావేరి అనుసంధానం, కృష్ణా జలాలపై చర్చించనున్న ముఖ్యమంత్రులు
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానున్నారు. కృష్ణా జలాల విడుదల, గోదావరి-కావేరి నదుల అనుసంధానం వంటి కీలక అంతర్రాష్ట్ర జలవివాదాలపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించనున్నారు.

తెలుగు గంగ ప్రాజెక్టు ఒప్పందం ప్రకారం, ఏపీ ఏటా 12 టీఎంసీల కృష్ణా జలాలను తమిళనాడుకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే, ఈ ఏడాది అక్టోబర్ 9 నాటికి కేవలం 2.251 టీఎంసీల నీరు మాత్రమే అందిందనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఇటీవల ప్రధానిని కోరిన చంద్రబాబు, ఈ అంశాన్ని కూడా విజయ్‌తో చర్చించనున్నారు. మరోవైపు... విజయ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న విజయ్, సాయంత్రం 4.15 గంటలకు చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అవుతారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత పున్నమి ఘాట్‌లో జరుగుతున్న 'విజయవాడ ఉత్సవ్‌ 2.0'కు ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. ఈ చర్చల్లో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. సీఎం విజయ్ పర్యటన నేపథ్యంలో విజయవాడలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
Advertisement
Joseph Vijay
Chandrababu Naidu
Andhra Pradesh Tamil Nadu Water Issues
Godavari Kaveri River Linking
Vijayawada Utsav 2.0
Telugu Ganga Project

More Telugu News