విశాఖపట్నం మేయర్ టికెట్ రేసు.. తెరపైకి బాలయ్య చిన్నకుమార్తె తేజస్విని పేరు!
- విశాఖ మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్
- ప్రధాన పార్టీలలో మొదలైన అభ్యర్థుల వేట
- టీడీపీ నుంచి తేజస్విని, లావణ్య పేర్ల ప్రచారం
- వైసీపీలో బొత్స ఝాన్సీ, హిమగౌరి పేర్లు పరిశీలన
- వైజాగ్‌కు మూడో మహిళా మేయర్ రాక ఖాయం
'గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్' (జీవీఎంసీ) ఎన్నికల సందడి మొదలైంది. మేయర్ పీఠానికి రిజర్వేషన్ ఖరారు కావడంతో, నగరం రాజకీయంగా వేడెక్కింది. ఈసారి విశాఖ మేయర్ పదవిని 'జనరల్ మహిళ'కు కేటాయించడంతో, ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైఎస్సార్‌సీపీలు తమ అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా దృష్టి సారించాయి. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ, గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పలువురి పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె, విశాఖ ఎంపీ శ్రీభరత్ అర్ధాంగి తేజస్విని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదేవిధంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అర్ధాంగి లావణ్య పేరు కూడా తెరపైకి వచ్చింది.
వీరితో పాటు మాజీ కార్పొరేటర్ ముక్కా శ్రావణి, మరో ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే అయినా, అధిష్ఠానం త్వరలోనే బలమైన అభ్యర్థిని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
మరోవైపు వైసీపీలో కూడా మేయర్ అభ్యర్థిత్వం కోసం గట్టి పోటీ నెలకొంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అర్ధాంగి, మాజీ ఎంపీ అయిన బొత్స ఝాన్సీ పేరు బలంగా వినిపిస్తోంది. ఆమెకు రాజకీయంగా మంచి అనుభవం ఉండటం కలిసొచ్చే అంశం.
అలాగే, మరో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అర్ధాంగి హిమగౌరి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, అనకాపల్లి మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి పేర్లు కూడా రేసులో ఉన్నాయి. వైసీపీ అధిష్ఠానం సైతం సామాజిక వర్గాల వారీగా అభ్యర్థి ఎంపికపై లెక్కలు వేస్తోంది.
గ్రేటర్ విశాఖ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరు మహిళలు మేయర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. జీవీఎంసీ ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజాన రమణి (2000-2005), ఆ తర్వాత 2021 నుంచి వైసీపీ తరఫున గొలగాని హరి వెంకట కుమారి మేయర్‌గా పనిచేశారు.
తాజా రిజర్వేషన్‌తో విశాఖకు మూడో మహిళా మేయర్ రానున్నారు. ప్రధాన పార్టీలు ప్రముఖుల కుటుంబ సభ్యుల పేర్లను పరిశీలిస్తుండటంతో ఈసారి మేయర్ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.