ఎవరీ హౌతీలు? సౌదీ అరేబియాపైనే ఎందుకు దాడులు చేస్తున్నారు?
- హౌతీలు యెమెన్‌కు చెందిన రాజకీయ, మత, సాయుధ ఉద్యమం
- యెమెన్ ఉత్తర ప్రాంతంలో జైదీ షియా మతసంప్రదాయ పునరుజ్జీవన ఉద్యమంగా ఇది ప్రారంభం
- 2014లో యెమెన్ రాజధాని సనా స్వాధీనం తర్వాత అంతర్యుద్ధం
- ఎక్కడ ఇరాన్ ప్రభావం తమ సరిహద్దుల్లోకి పాకుతుందోనని సౌదీ సైనిక జోక్యం
- పర్వత ప్రాంతాలు, ఎడారులు వీరికి సహజ రక్షణ
ఇరాన్ యుద్ధం ఇప్పటికే ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. చమురు సరఫరా, నౌకాయానం, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడుతున్న వేళ.. తాజాగా సౌదీ అరేబియాపై హౌతీల దాడులు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించినట్లు హౌతీలు ప్రకటించారు.
యెమెన్‌లో పుట్టిన ఓ సాయుధ ఉద్యమం సౌదీ వంటి శక్తిమంతమైన దేశాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటోంది? హౌతీ వెనుక ఇరాన్ పాత్ర ఎంత? వారి దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపవచ్చు? ఈ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే హుతీల నేపథ్యం, లక్ష్యాలు తెలుసుకోవాలి.
హౌతీలు ఎవరు? ఎక్కడ ఉంటారు?
హౌతీలు యెమెన్‌కు చెందిన రాజకీయ, మత, సాయుధ ఉద్యమం. వీరు తమ సంస్థను ‘అన్సార్ అల్లా’గా పిలుచుకుంటారు. 1990వ దశకంలో యెమెన్ ఉత్తర ప్రాంతంలో జైదీ షియా మతసంప్రదాయ పునరుజ్జీవన ఉద్యమంగా ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా సాయుధ శక్తిగా ఎదిగింది. 2014లో యెమెన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకుని, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని కూలదోసింది. ప్రస్తుతం దేశంలోని వాయవ్య ప్రాంతంలో హౌతీలకు గట్టి పట్టు ఉంది. ఈ ప్రాంతంలో యెమెన్ జనాభాలో గణనీయమైన భాగం నివసిస్తోంది.
పర్వత ప్రాంతాలు, ఎడారులు వీరికి సహజ రక్షణగా మారాయి. క్షిపణులు, డ్రోన్లు సహా సుదూర లక్ష్యాలను చేరుకోగల ఆయుధాలను వినియోగించే సామర్థ్యాన్ని కూడా హౌతీలు పెంచుకున్నారు. అందుకే యెమెన్‌లోని తమ స్థావరాలపై వైమానిక దాడులు జరిగినా వారిని పూర్తిగా బలహీనపరచడం ప్రత్యర్థి దళాలకు కష్టంగా మారింది.
సౌదీ అరేబియాపై ఎందుకు దాడులు?
హౌతీలు, సౌదీ అరేబియా మధ్య వైరం ఇప్పటిది కాదు. 2014లో హౌతీలు సనాను స్వాధీనం చేసుకున్న తర్వాత యెమెన్‌లో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్ ప్రభావం తమ సరిహద్దుల వరకు విస్తరిస్తుందనే ఆందోళనతో సౌదీ అరేబియా 2015లో సైనిక జోక్యం చేసుకుని, యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా హౌతీలపై పోరాటం ప్రారంభించింది. ఏళ్ల తరబడి జరిగిన యుద్ధంలో వైమానిక దాడులు, క్షిపణి దాడులు కొనసాగాయి. 2022లో కుదిరిన కాల్పుల విరమణతో కొంతకాలం ప్రశాంతత నెలకొన్నా.. తాజా పరిణామాలతో మళ్లీ ఘర్షణలు పెరిగాయి.
సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా దాడులు చేయడం ద్వారా తమపై జరుగుతున్న సైనిక చర్యలకు ప్రతీకారం తీర్చుకోవడం, ప్రత్యర్థి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం హౌతీల లక్ష్యాల్లో భాగంగా కనిపిస్తోంది. విమానాశ్రయాలు, చమురు కేంద్రాలు వంటి కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే సౌదీ ఆర్థిక కార్యకలాపాలతో పాటు భద్రతపైనా ప్రభావం పడుతుంది.
ఇరాన్‌తో సంబంధాలేంటి?
హౌతీలకు ఇరాన్‌తో రాజకీయ, సైనిక సంబంధాలున్నాయి. ఇరాన్ తన ప్రాంతీయ మిత్రశక్తుల్లో హుతీలనూ భాగంగా చూస్తోంది. అమెరికా, సౌదీ అరేబియా సహా పలు దేశాలు హౌతీలకు ఇరాన్ ఆయుధాలు, శిక్షణ, నిధుల సాయం అందిస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే హౌతీలు తాము ఇరాన్ చేతిలో కీలుబొమ్మలం కాదని, తమ సొంత నిర్ణయాలతో పనిచేస్తున్నామని చెబుతున్నారు. ఈ సంబంధాల స్వరూపం, ఇరాన్ ప్రభావం ఎంతవరకు ఉందనే అంశాలపై స్పష్టత మాత్రం పరిమితంగానే ఉంది.
ప్రపంచానికి ఎందుకు ఆందోళన?
యెమెన్ సమీపంలోని ‘బాబ్ అల్ మండెబ్’ జలసంధి ఎర్ర సముద్రాన్ని ‘గల్ఫ్ ఆఫ్ ఏడెన్’తో కలుపుతుంది. ఆసియా, యూరప్ మధ్య నౌకాయానానికి ఇది కీలక మార్గం. ఈ ప్రాంతంలో దాడులు పెరిగితే నౌకలు ఆఫ్రికా చుట్టూ సుదీర్ఘ మార్గంలో ప్రయాణించాల్సి రావచ్చు. రవాణా ఖర్చులు, బీమా వ్యయాలు పెరిగి చమురు ధరలు, వస్తువుల సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది.
తాజా దాడులతో రియాద్ విమానాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోవడం, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడటం పరిస్థితి తీవ్రతను చూపిస్తున్నాయి. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగుతుందా? ఇతర దేశాలు సైనికంగా జోక్యం చేసుకుంటాయా? అన్నది కూడా కీలకంగా మారింది.
హౌతీల దాడులు సౌదీ అరేబియా, యెమెన్ మధ్య పోరాటానికే పరిమితమయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ ఘర్షణ మరింత విస్తరిస్తే చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. అందుకే హౌతీలు ఎవరు, వారి లక్ష్యాలేంటి అనే ప్రశ్నలు ఇప్పుడు మధ్యప్రాచ్య రాజకీయాలను అర్థం చేసుకోవడంలో కీలకంగా మారాయి.