ప్రజల మనసు గెలిచినా.. సింహాసనానికి అనర్హురాలు! జపాన్ యువరాణి ఐకో కథ
- ప్రజల ప్రేమాభిమానాలు చూరగొంటున్న జపాన్ యువరాణి ఐకో
- పురుష వారసులకే సింహాసనం దక్కాలనే ఇంపీరియల్ చట్టం అడ్డంకి
- వారసుల కొరతతో తీవ్రమవుతున్న రాజవంశ సంక్షోభం
- మహిళా చక్రవర్తికి ప్రజల మద్దతు ఉన్నా, ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు
- లింగ వివక్షపై ఐక్యరాజ్యసమితి సూచనలను తోసిపుచ్చిన జపాన్
జపాన్‌లో ఆమె ఒక సెలబ్రిటీ. ఆమె కనిపిస్తే ప్రజలు ఉప్పొంగిపోతారు. ఆమె ఫ్యాషన్ స్టైల్ యువతకు ఒక ట్రెండ్. అపారమైన ప్రజాదరణ, అందరి అభిమానం చూరగొన్న ఆమే జపాన్ యువరాణి ఐకో. అయితే, ప్రజల హృదయాలను గెలుచుకున్న ఆమె, తన దేశ సింహాసనాన్ని అధిష్ఠించడం మాత్రం కుదరదు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాజవంశానికి వారసురాలిగా ఉన్నా, కేవలం మహిళ అన్న ఒకే ఒక్క కారణంతో 'సామ్రాజ్ఞి'
పీఠానికి అనర్హురాలిగా నిలుస్తున్నారు.
చట్టమే అసలైన అడ్డంకి
జపాన్ చక్రవర్తి నరుహిటో, సామ్రాజ్ఞి మసకో దంపతుల ఏకైక సంతానం 24 ఏళ్ల యువరాణి ఐకో. ఆమె 'సామ్రాజ్ఞి' కాలేకపోవడానికి కారణం 1947 నాటి ఇంపీరియల్ హౌస్ లా. 1889 నాటి మెయిజీ నిబంధనల ఆధారంగా రూపొందించిన ఈ చట్టం ప్రకారం, రాజవంశంలోని పురుష సంతతికి చెందిన పురుషులు మాత్రమే సింహాసనాన్ని అధిష్ఠించేందుకు అర్హులు. మహిళలకు వారసత్వ హక్కులో ఎలాంటి స్థానం లేదు. గతంలో, రాజవంశానికి చెందిన మహిళలు సామాన్యులను వివాహం చేసుకుంటే తమ రాజ హోదాను కూడా కోల్పోవాల్సి వచ్చేది.
తీవ్రమవుతున్న వారసుల సంక్షోభం
ఈ కఠినమైన చట్టం కారణంగా జపాన్ రాజవంశం ఇప్పుడు తీవ్రమైన వారసుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత ఉన్నవారు కేవలం ముగ్గురే. వారు చక్రవర్తి నరుహిటో తమ్ముడు క్రౌన్ ప్రిన్స్ అకిషినో, ఆయన కుమారుడు 20 ఏళ్ల ప్రిన్స్ హిసాహిటో, చక్రవర్తికి బాబాయ్ అయిన 90 ఏళ్ల వృద్ధుడు ప్రిన్స్ హిటాచి. మూడు దశాబ్దాల క్రితం 30 మంది సభ్యులతో కళకళలాడిన రాజ కుటుంబం, ఇప్పుడు కేవలం 16 మందికి పరిమితమైంది. వీరిలో పురుషులు ఐదుగురు మాత్రమే. ఒకవేళ ప్రిన్స్ హిసాహిటోకు భవిష్యత్తులో మగ సంతానం కలగకపోతే, రాజవంశం కొనసాగడమే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం వర్సెస్ ప్రజాభిప్రాయం
ఈ సంక్షోభాన్ని గుర్తించిన ప్రధానమంత్రి సనే టకైచి ప్రభుత్వం, కొన్ని పరిమిత సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 2026 అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పుల ప్రకారం, రాజవంశ మహిళలు సామాన్యులను పెళ్లాడినా తమ హోదాను కోల్పోరు. అలాగే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రాజకుటుంబం నుంచి వేరుపడిన శాఖల పురుష వారసులు తిరిగి రాజవంశంలో చేరేందుకు అవకాశం కల్పించారు. అయితే, ఈ సంస్కరణలు రాజ కుటుంబ సభ్యుల సంఖ్యను పెంచడానికే తప్ప, యువరాణి ఐకో వంటి మహిళలకు సింహాసనంపై హక్కు కల్పించడానికి కాదు. 126 తరాలుగా పురుష వారసత్వ పరంపర కొనసాగడమే చక్రవర్తి అధికారానికి, చట్టబద్ధతకు పునాది అని ప్రభుత్వం వాదిస్తోంది.
కానీ, జపాన్ ప్రజల ఆలోచన దీనికి భిన్నంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో నిర్వహించిన ఒక సర్వేలో 72 శాతం మంది ఓ రాజకుటుంబీకురాలు సింహాసనం అధిష్ఠించేందుకు మద్దతు తెలుపగా, కేవలం 10 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. కేవలం లింగ భేదం కారణంగా ఒకరిని సింహాసనానికి దూరం చేయడంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. చారిత్రకంగా జపాన్‌ను 8 మంది సామ్రాజ్ఞులు పాలించినా, వారిని తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగానే చూశారు. 2024లో ఐక్యరాజ్యసమితి మహిళా హక్కుల కమిటీ సైతం ఈ వివక్షను సవరించాలని సూచించినా, జపాన్ ప్రభుత్వం ఆ సిఫార్సును తిరస్కరించింది. దీంతో, అశేష ప్రజాదరణ ఉన్నా, యువరాణి ఐకోకు చక్రవర్తి పీఠం ఒక కలగానే మిగిలిపోతోంది.