ఇలాంటి పామును ఎప్పుడూ చూసి ఉండరు!
Add ap7am to your home Screen

ఇలాంటి పామును ఎప్పుడూ చూసి ఉండరు!

Green Keelback rare snake spotted in Karnataka you have never seen before
  • కర్ణాటకలోని బీఆర్ హిల్స్‌లో అరుదైన పాము ప్రత్యక్షం
  • ఆలివ్ గ్రీన్ రంగులో కనిపించిన గ్రీన్ కీల్‌బ్యాక్ పాము
  • నాగుపాములా పడగ విప్పి భయపెట్టినా.. ఇది విషరహితం
  • పామును సురక్షితంగా పట్టుకుని అడవిలోకి వదిలేసిన వైనం
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఒక అరుదైన పాము కనిపించి స్థానికులను ఆశ్చర్యపరిచింది. బిళిగిరి రంగన బెట్ట (బీఆర్ హిల్స్) అటవీ ప్రాంతంలోని గంగావాడి గ్రామ సమీపంలో ఆలివ్-గ్రీన్ రంగులో ఉన్న 'గ్రీన్ కీల్‌బ్యాక్' జాతి పామును గుర్తించారు. సాధారణంగా ఈ జాతి పాములు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి, కానీ ఈ ప్రత్యేకమైన ఆలివ్-గ్రీన్ రంగు చాలా అరుదని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ గ్రీన్ కీల్‌బ్యాక్ పాముకు విషం ఉండదు. అయితే, ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడు తనను తాను రక్షించుకోవడానికి నాగుపాములా పడగ విప్పి భయపెడుతుంది. కప్పలు, ఎలుకలు, బల్లులు, ఇతర చిన్న సరీసృపాలను ఇది ఆహారంగా తీసుకుంటుంది. తూర్పు, పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతంలో ఉన్న బీఆర్ హిల్స్.. బిళిగిరి రంగస్వామి ఆలయ (BRT) టైగర్ రిజర్వ్‌లో భాగంగా ఉంది. ఈ ప్రాంతం జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది.

గ్రామ సమీపంలో కనిపించిన ఈ అరుదైన పామును స్థానికులు, అటవీ సిబ్బంది సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని ఎటువంటి హాని కలగకుండా తిరిగి సమీపంలోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.
Advertisement
Green Keelback
Chamarajanagar Karnataka
Rare olive green snake
BR Hills Tiger Reserve
Wildlife rescue Karnataka
Non venomous snakes India

More Telugu News