జగన్ అందుకే తప్పుడు కథనాలు, కార్టూన్లతో తప్పుదోవ పట్టిస్తున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర
- ఆర్థిక నేరాల కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ కాలయాపన చేస్తున్నారన్న మంత్రి
- ఈడీ విచారణకు రాజకీయ రంగు పులుముతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ
- వివేకా హత్య కేసులోనూ జగన్ రాజకీయ నాటకాలు ఆడారని తీవ్ర విమర్శలు
- అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి పత్రికతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- కేసుల విచారణ వేగవంతం చేసి నిజాలు బయటపెట్టాలని మంత్రి రవీంద్ర డిమాండ్
వాస్తవాలను పక్కదారి పట్టించి, వాటిని రాజకీయంగా వాడుకోవడమే జగన్ రాజకీయ నీతి అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనపై ఉన్న ఆర్థిక నేరాల కేసుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ ఎదుటివారిపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. తన పత్రికలో తప్పుడు కథనాలు, కార్టూన్లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గుడ్డ కాల్చి ఎదుటివారి మీద వేయడం జగన్‌కు అలవాటుగా మారిందని, దర్యాప్తు సంస్థల విచారణకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు.
తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ సుమారు రూ.48 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై 2011లో కాంగ్రెస్ హయాంలోనే సీబీఐ కేసులు నమోదు చేసిందని మంత్రి గుర్తుచేశారు. "షెల్ కంపెనీలను సృష్టించి, కంపెనీల వాటాల విలువను కృత్రిమంగా పెంచి, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకే ఇప్పుడు జగన్ నానా తంటాలు పడుతున్నారు" అని రవీంద్ర వివరించారు.
వివేకా హత్య నుంచి ఈడీ విచారణ వరకు.. అన్నీ నాటకాలే
తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ జగన్ రాజకీయ నాటకాలు ఆడారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. "అప్పట్లో చంద్రబాబుపై నిందలు వేస్తూ ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ సాక్షి పత్రికలో కథనాలు రాయించారు. కానీ, ఆయన చెల్లెలు సునీత న్యాయపోరాటంతో నిజాలు వెలుగులోకి వచ్చి, విచారణ తాడేపల్లి ప్యాలెస్ వైపు దారితీయలేదా?" అని జగన్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈడీ విచారణ వేగవంతం అవుతుండటంతో, దానిని అడ్డుకునేందుకు జగన్ 4,000కు పైగా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
అసత్యాల ‘సాక్షి’.. దర్యాప్తు సంస్థలపై దుష్ప్రచారం
అవినీతి సొమ్ముతో ఏర్పాటైన సాక్షి పత్రిక, పేరుకు మాత్రమే సాక్షి అని, అది అసత్యాలకు నిలువుటద్దంగా మారిందని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఈడీ అనేది కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని, రాష్ట్ర ప్రభుత్వానికి దానితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. "విచారణ వేగవంతం అవుతుంటే, దానిపై రాజకీయ కక్ష సాధింపు అని ముద్ర వేస్తూ సాక్షిలో కార్టూన్లు, కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది దర్యాప్తు సంస్థల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే" అని అన్నారు.
ఆర్థిక నేరాలు సమాజానికి క్యాన్సర్ వంటివి
ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి క్యాన్సర్ వంటివని సుప్రీంకోర్టే చెప్పిందని మంత్రి గుర్తుచేశారు. "డబ్బుంటే కేసులను ఏళ్ల తరబడి సాగదీయవచ్చా? కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా విచారణను ఆలస్యం చేయవచ్చా? ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే" అని రవీంద్ర మండిపడ్డారు. తన స్వార్థం కోసం కన్నతండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సైతం కేసుల్లో ఏ5గా చేర్చే పరిస్థితికి జగనే కారణమయ్యారని, ఇది సిగ్గుచేటని విమర్శించారు. 16 నెలలు జైలులో ఉన్నా జగన్‌లో మార్పు రాలేదని, ఇప్పటికీ ‘రప్పా రప్పా’ అంటూ యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
తప్పు చేసినవారు చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని, విచారణలో కొంత ఆలస్యం జరిగినా శిక్ష అనుభవించడం ఖాయమని హెచ్చరించారు. కేసుల విచారణను వేగవంతం చేసి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని దర్యాప్తు సంస్థలను, న్యాయస్థానాలను కోరారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా చట్టం నుంచి జగన్ తప్పించుకోలేరని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.