విజయవాడ ఉత్సవాలను గ్రాండ్ సక్సెస్ చేయాలి: సీఎం చంద్రబాబు
- ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని సీఎం ఆదేశం
- దసరా సామాన్యుల పండుగలా జరగాలి, వీఐపీలదిగా కాదని స్పష్టం
- అక్టోబర్ 13 నుంచి జాతీయ స్థాయి సరస్ మేళాకు పకడ్బందీ ఏర్పాట్లు
- విజయవాడ ఉత్సవ్ 2.0తో ఆర్థిక కార్యకలాపాలు పెరగాలని సూచన
- రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో సీఎం సమీక్ష
విజయవాడలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, త్వరలో ప్రారంభం కానున్న జాతీయ స్థాయి సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్ 2.0లను అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ భారీ కార్యక్రమాల విజయానికి దేవాదాయ, పర్యాటక శాఖలతో పాటు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
దసరా ఉత్సవాలు సామాన్యుల పండుగలా జరగాలని, వీఐపీల కోసం కాదని సీఎం స్పష్టం చేశారు. "ఇంద్రకీలాద్రి ఉత్సవాలు సామాన్యుల దసరాగా ఉండాలి, వీఐపీల దసరాగా కాదు. దీనికి అన్ని వర్గాలు సహకరించాలి" అని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో, వారి రాక వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. వీఐపీల రాకతో విధించే ట్రాఫిక్ ఆంక్షల గురించి ప్రజలకు ముందుగా తెలియజేయాలని, వారి ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.
అక్టోబర్ 13 నుంచి 31 వరకు పున్నమి ఘాట్‌లో నిర్వహించనున్న 'జాతీయ సరస్ మేళా-2026' దేశానికే ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ మేళాకు, దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్న నేపథ్యంలో ఆమె పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన కోసం 576 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, అందులో 208 స్టాళ్లు ఏపీకి చెందినవని అధికారులు వివరించారు. మన రాష్ట్ర మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను 'స్వయం ఏపీ' బ్రాండ్ కింద జాతీయ స్థాయిలో ప్రదర్శించి, విక్రయించేందుకు ఈ మేళా గొప్ప వేదిక కావాలని సీఎం అన్నారు.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'విజయవాడ ఉత్సవ్ 2.0'ను కూడా ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, ప్రజల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. ఈ వరుస కార్యక్రమాల వల్ల భక్తులు, పర్యాటకుల రాకతో ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సీఎం పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.