వెస్టిండీస్‌తో నేడు మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న గంభీర్, కోటక్
- నేడు టీమిండియా-వెస్టిండీస్ మూడో టీ20
- ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా మ్యాచ్
- ఈ ఉదయం ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించిన గంభీర్
- జట్టు గెలుపు కోసం పూజలు
వెస్టిండీస్‌తో ఇండోర్‌లో జరగనున్న కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ దైవ దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం ఇద్దరూ ఉజ్జయినిలోని ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి, పరమశివుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.
ఆలయ సందర్శన అనంతరం గంభీర్ మీడియాతో మాట్లాడాడు. "స్వామి వారు నన్ను దర్శనానికి పిలిచారు. ఆయన ఆశీస్సులు నాకు, దేశానికి ఎల్లప్పుడూ ఉంటాయి. మేం కచ్చితంగా రాణిస్తామని, దేవుడి ఆశీర్వాదం మాతోనే ఉంటుందని విశ్వసిస్తున్నాను" అని ధీమా వ్యక్తం చేశాడు.
గంభీర్, కోటక్ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో హోల్కర్ స్టేడియంలోనే జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేకు ముందు కూడా వారు ఇక్కడికి వచ్చారు. ఆ పర్యటనలో ఇద్దరు కోచ్‌లు తెల్లవారుజామున జరిగే భస్మ హారతిలో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు నంది హాల్‌లో కూర్చుని జట్టు విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంభీర్‌కు మహాకాళేశ్వరుడిపై అపారమైన భక్తి ఉందని, గతంలోనూ పలుమార్లు కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్నారని సన్నిహితులు చెబుతుంటారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, రాంచీలో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు విజయం సాధించింది. దీంతో భారత జట్టు బౌలింగ్ విభాగంలో లోపాలను సరిదిద్దుకొని బరిలోకి దిగాలని చూస్తోంది. మరోవైపు, అదే ఊపును కొనసాగించి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని విండీస్ పట్టుదలగా ఉంది. బ్యాటింగ్‌కు స్వర్గధామంలాంటి ఇండోర్ పిచ్‌పై మరో భారీ స్కోరింగ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.