ఎవరైనా మూడు పూటలు తింటారు.. ఆమె ప్రతి 3 నిమిషాలకు తింటుంది: అమితాబ్
- దీపిక పదుకొణె ప్రతి 3 నిమిషాలకు ఏదో ఒకటి తింటుందని చెప్పిన అమితాబ్
- 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో దీపిక ఆహారపు అలవాట్లపై సరదా చర్చ
- తాను డబ్బా తెరిచినప్పుడల్లా అమితాబ్ అడిగేవారని దీపిక కౌంటర్
- ఇంటి నుంచి ఫుడ్ తెస్తాను కాబట్టే దీపిక నాతో పనిచేస్తుందన్న ఫరాఖాన్
- తారల మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి 'పీకూ' వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించారు. అయితే, దీపిక ఆహారపు అలవాట్ల గురించి అమితాబ్ చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు వైరల్ అవుతోంది. 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోకి దీపిక పదుకొణె, ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ అతిథులుగా హాజరైనప్పుడు ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ, దీపిక ఆహారపు అలవాట్ల గురించి ఓ రహస్యం చెప్పారు. "సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు మూడుసార్లు భోజనం చేస్తారు. కానీ, దీపిక మాత్రం ప్రతి మూడు నిమిషాలకు ఏదో ఒకటి తింటూనే ఉంటుంది. నేను ఇది స్వయంగా చూశాను. ప్రతి మూడు నిమిషాలకు ఎవరో ఒకరు ఒక బౌల్‌లో ఆమె కోసం ఆహారం తీసుకొస్తారు. కానీ, ఒక్కసారి కూడా, మీరు కూడా తింటారా అని అడగదు" అంటూ బిగ్ బీ సరదాగా ఫిర్యాదు చేశారు.
అమితాబ్ వ్యాఖ్యలకు దీపిక వెంటనే కౌంటర్ ఇచ్చారు. అసలు కథ వేరే ఉందని, "నేను ఎప్పుడు నా ఫుడ్ డబ్బా తెరిచినా, అమిత్ జీ నా దగ్గరికి వచ్చి 'ఏం తింటున్నావ్' అని పదేపదే అడిగేవారు" అని నవ్వుతూ చెప్పారు. దీనికి అమితాబ్ స్పందిస్తూ, "ఈ షోలో అబద్ధాలు చెప్పడానికి అనుమతి లేదు!" అని అనడంతో సెట్‌లో నవ్వులు పూశాయి.
ఈ సరదా చర్చలో ఫరాఖాన్ కూడా పాల్గొన్నారు. దీపిక తనతో ఎందుకు పనిచేస్తుందో అసలు రహస్యం చెప్పారు. "దీపిక నాతో సినిమాలు చేయడానికి కారణం ఇదే. నేను ఆమె కోసం ఇంటి నుంచి భోజనం తెస్తాను" అని ఫరా తెలిపారు. ఈ క్రమంలో అమితాబ్.. తనకు ఫరా ఎప్పుడూ ఇంటి బిర్యానీ పంపలేదని సరదాగా ఫిర్యాదు చేశారు. దీనికి ఫరాఖాన్ స్పందిస్తూ, "సర్, మా ఇంట్లో కేవలం వెజ్ పులావ్ మాత్రమే ఉంటుంది" అని ఫన్నీగా వివరణ ఇచ్చారు.
కాగా, ఫరాఖాన్ దర్శకత్వం వహించిన 'ఓం శాంతి ఓం' చిత్రంతోనే దీపిక పదుకొణె బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత అమితాబ్, దివంగత ఇర్ఫాన్ ఖాన్‌లతో కలిసి ఆమె నటించిన 'పీకూ' చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గానూ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.