ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఢిల్లీలో హై అలర్ట్
- ధ్రువ్ రాఠీని గురుగ్రామ్‌లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- శనివారం ఉదయం 8 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సీజేపీ వెల్లడి
- జంతర్‌మంతర్ వద్ద సీజేపీ నిరసనలో పాల్గొనేందుకు వెళ్లనున్న నేపథ్యంలో చర్యలు
- ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా బెంగళూరులోనూ నిరసనలో పాల్గొన్న రాఠీ
- ఢిల్లీ సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనకు సిద్ధమవుతున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీని గురుగ్రామ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు అరెస్ట్ చేసినట్లు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది. అయితే, ఆయనను అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలపై స్పష్టత లేదు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ జంతర్‌మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాఠీ సిద్ధమయ్యారు. గురువారం బెంగళూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలోనూ ఆయన పాల్గొన్నారు.
సీజేపీ ఎక్స్ ఖాతాలోని సమాచారం ప్రకారం.. శనివారం ఉదయం 8 గంటల సమయంలో సుమారు 50 మంది పోలీసులు సాధారణ దుస్తుల్లో రాఠీ నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
సీజేపీ నిరసన నేపథ్యంలో దేశ రాజధానిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిరసన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులకు బాడీ కెమెరాలు అందించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసాల వద్ద కూడా భద్రతను పెంచారు.
ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు, మండీ హౌస్ సహా పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు.
నిరసన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ ఆయా నగర్ సరిహద్దుకు చేరుకున్నారు. ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
అనధికార వ్యక్తులు న్యూఢిల్లీకి రాకుండా అడ్డుకుంటున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామని అనంత్ తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోనూ డ్రోన్లతో నిఘా కొనసాగుతోంది. ఢిల్లీ పోలీసులు, ‘ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్’ (ఆర్‌ఏఎఫ్) సిబ్బందిని మోహరించారు. భద్రతా కవాతులు నిర్వహిస్తున్నారు.