ఆర్బీఐ రెపో రేటు పెంపు.. మీ హోమ్ లోన్ ఈఎంఐ పెరుగుతుందా?
- 5.50 శాతానికి పెరిగిన రెపోరేటు
- ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్లపై ప్రభావం పడే ఛాన్స్
- ఈఎంఐ లేదా రుణ కాలపరిమితి పెరిగే అవకాశం
- కచ్చితంగా ఈఎంఐ పెరుగుతందని చెప్పలేం
- బ్యాంకులో వివరాలు తెలుసుకొని ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మేలు
ఇల్లు కొనాలనుకునేవారికి, ఇప్పటికే హోమ్ లోన్ చెల్లిస్తున్నవారికి ఆర్బీఐ తాజా నిర్ణయం కీలకంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. 2023 ఫిబ్రవరి తర్వాత రెపో రేటును పెంచడం ఇదే తొలిసారి. అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నారు. పాలసీ వైఖరిని ‘క్యాలిబ్రేటెడ్ టైటనింగ్’గా మార్చడం ద్వారా సమీప కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్బీఐ అంతగా దృష్టి పెట్టడం లేదన్న సంకేతాలు ఇచ్చింది.
రెపో రేటు అంటే ఏమిటి?
బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీనే రెపో రేటు. ఆర్బీఐ ఈ రేటును పెంచితే బ్యాంకులకు నిధుల సమీకరణ ఖర్చు పెరగొచ్చు. దాని ప్రభావం రుణాలపై పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్‌తో ఉన్న హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది.
లోన్ ఈఎంఐ ఎంత పెరుగుతుంది?
రెపో రేటు పెరిగితే ఈఎంఐ ఎంత పెరుగుతుందో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. రూ.50 లక్షల హోమ్ లోన్‌ను 20 ఏళ్లకు 8.5 శాతం వడ్డీతో తీసుకున్నారని అనుకుందాం. ప్రస్తుతం మీ నెలవారీ ఈఎంఐ సుమారు రూ.43,391గా ఉంటుంది.
ఆర్బీఐ తాజా పెంపు ప్రభావంతో మీ బ్యాంక్ వడ్డీ రేటు 0.25 శాతం పెరిగి 8.75 శాతానికి చేరిందని అనుకుందాం. అదే 20 ఏళ్ల కాలాన్ని కొనసాగిస్తే మీ ఈఎంఐ సుమారు రూ. 44,191కు పెరగొచ్చు. అంటే నెలకు దాదాపు రూ.800 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. 20 ఏళ్ల మొత్తం కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ అదనపు భారం సుమారు రూ.1.9 లక్షలు ఉండొచ్చు.
మీ ఈఎంఐ వెంటనే పెరుగుతుందా?
అలా తప్పనిసరిగా జరగాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ రెపో రేటు పెంచిన వెంటనే మీ హోమ్ లోన్ ఈఎంఐ మరుసటి రోజే పెరగదు. మీ బ్యాంక్ వడ్డీ రేటును ఎంత మేరకు మారుస్తుందన్నదే కీలకం.
కొన్ని బ్యాంకులు ఈఎంఐని పెంచొచ్చు. మరికొన్ని బ్యాంకులు ఈఎంఐని అలాగే ఉంచి రుణ కాలపరిమితిని పెంచొచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో ఈఎంఐ, రుణ కాలపరిమితి రెండింటిపైనా ప్రభావం ఉండొచ్చు. మీ లోన్ రకం, వడ్డీ రేటు, మిగిలిన రుణ కాలం బట్టి అసలు ప్రభావం మారుతుంది.
హోమ్ లోన్ ఉన్నవారు ఏం చేయాలి?
ముందుగా మీ హోమ్ లోన్ ఫ్లోటింగ్ రేటుతో ఉందా, ఫిక్స్‌డ్ రేటుతో ఉందా తెలుసుకోవాలి. ఫ్లోటింగ్ రేట్ అయితే ఆర్బీఐ రేటు పెంపు తర్వాత మీ బ్యాంక్ వడ్డీ రేటును ఎలా మార్చనుందో తెలుసుకోవాలి. ఈఎంఐ పెరుగుతుందా? లేక రుణ కాలపరిమితి పెరుగుతుందా? రెండూ మారతాయా? అన్నది బ్యాంక్‌ను అడిగి స్పష్టత తీసుకోవాలి. దాన్ని బట్టి మీ ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.