ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.50 శాతానికి పెంపు
- రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్‌బీఐ
- ఎస్‌డీఎఫ్ రేటు 5.25 శాతానికి చేరిక
- ఎంఎస్‌ఎఫ్, బ్యాంక్ రేటు 5.75 శాతానికి పెంపు
- ఆగస్టులో ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరిక
- క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిన ప్రభావం
- రానున్న సమావేశాల్లోనూ కఠిన నిర్ణయాలపై అంచనాలు
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు సవాళ్లుగా మారుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి చేరింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటుతో పాటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 5.25 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటు 5.75 శాతానికి చేరాయి.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం ఉందని మల్హోత్రా తెలిపారు. దీంతో పలు ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. భారత్‌లోనూ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆగస్టులో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరింది. జులైలో ఇది 4.45 శాతంగా ఉంది.
క్రూడ్ ధరల ప్రభావం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి. అంతర్జాతీయంగా బాండ్ ఈల్డ్స్ పెరగడం, క్రూడ్ ధరలు ఎగబాకడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడంతో రెపో రేటును యథాతథంగా ఉంచే అవకాశం తగ్గిందని ఆర్థిక నిపుణులు తెలిపారు.
ఫిబ్రవరి 2023 తర్వాత తొలిసారి రెపో రేటు పెరగొచ్చని నిపుణులు ముందుగానే అంచనా వేశారు. ద్రవ్యోల్బణం దాదాపు 5 శాతానికి చేరుతున్న నేపథ్యంలో రానున్న సమావేశాల్లోనూ కఠిన నిర్ణయాలు ఉండొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది.
ముందస్తు చర్య అవసరం
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, మార్కెట్లలో మారుతున్న రిస్క్‌ల నేపథ్యంలో ముందస్తు చర్య తీసుకోవడం మంచిదని ఎస్‌బీఐ రీసెర్చ్ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎల్‌నినో ప్రభావం, అక్టోబర్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కూడా రబీ పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు తెలిపారు.