ఓటీటీ స్క్రీన్ పైకి సస్పెన్స్ థ్రిల్లర్ 'మారెమ్మ'

ఓటీటీ స్క్రీన్ పైకి సస్పెన్స్ థ్రిల్లర్ 'మారెమ్మ'

Maremma Movie Update
  • విలేజ్ నేపథ్యంలో సాగే 'మారెమ్మ'
  • రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ
  • కథానాయికగా దీపాబాలు పరిచయం 
  • సెప్టెంబర్ 9న థియేటర్లకు వచ్చిన సినిమా
  • ఈ నెల 9 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్  

 ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి ఒక తెలుగు సినిమా సిద్ధమవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్  లో రూపొందిన ఆ సినిమా పేరే 'మారెమ్మ'.మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ సినిమాని మంచాల నాగరాజు దర్శకత్వం వహించాడు. పల్లెటూరు నేపథ్యంలో యాక్షన్ ను టచ్ చేస్తూ సాగే సస్పెన్స్ థ్రిల్లర్ఫ్ ఇది. రవితేజ సోదరుడి కొడుకైన 'మాధవ్' ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన జోడీగా 'హార్ట్ బీట్' ఫేమ్ దీపాబాలు నటించింది. 

'హార్ట్ బీట్' సిరీస్ తో దీపబాలు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మనసులు కొల్లగొట్టేసింది. ఆ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణగా నిలిచిన దీపాబాలుకి తెలుగు నుంచి అవకాశాలు వెళ్లడం ఖాయమని అనుకున్నారు. అనుకున్నట్టే ఆమె 'మారెమ్మ' సినిమాలో కథానాయికగా తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 

అది ఒక అందమైన పల్లెటూరు .. ఆ ఊళ్లోని వాళ్లంతా 'మారెమ్మ' తల్లిని ఇలవేల్పుగా పూజిస్తూ ఉంటారు. అమ్మవారికి సమర్పించిన దున్నపోతు 'మారి' .. ఆ ఊరికి చెందిన 'కర్ణి' సంరక్షణలో ఉంటుంది. ఒకరోజున ఆ దున్నపోతు కనిపించకుండా పోతుంది. ఆ దున్నపోతు కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? దానిని వెతికే క్రమంలో 'కర్ణి'కి ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? అనేది మిగతా కథ. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి. 

Advertisement
Maremma
Madhav
Deepa Balu
Aha OTT
Telugu suspense thriller
Ravi Teja nephew movie

More Telugu News