లక్షన్నర జీతం వదులుకొని.. సగం జీతానికే జై.. ఎందుకిలా?
- అధిక జీతాల కన్నా ఫ్లెక్సిబులిటీకే వర్కింగ్ తల్లుల ప్రాధాన్యం
- పిల్లల కోసం లక్షల జీతాన్ని సైతం వదులుకుంటున్న మహిళలు
- కెరీర్ ఎదుగుదలను తాత్కాలికంగా పక్కన పెడుతున్న తల్లులు
- ఫ్లెక్సిబులిటీ లేకపోతే ఉద్యోగం మానేయడమే సరైనదంటున్న ఉద్యోగినులు
- ఉద్యోగం విలువను జీతంతో కాకుండా జీవితంతో కొలుస్తున్న మహిళలు
ఉద్యోగం చేసే మహిళలకు, ముఖ్యంగా తల్లులకు ఒక దశలో ఒక కీలకమైన ప్రశ్న ఎదురవుతుంది. "అధిక జీతం కోసం నా సమయాన్ని, శక్తిని, కుటుంబ జీవితాన్ని ఎంతమేర త్యాగం చేయాలి?" గతంలో కెరీర్ అంటే కేవలం ఉన్నత హోదా, ఎక్కువ జీతం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ ధోరణి మారుతోంది. అధిక జీతం కన్నా పనిలో సౌలభ్యం (ఫ్లెక్సిబిలిటీ), కుటుంబంతో గడిపే సమయానికే నేటి మహిళలు ఎక్కువ విలువిస్తున్నారు.
ఢిల్లీకి చెందిన స్వాతి (పేరు మార్చాం) దీనికి ఒక ఉదాహరణ. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, ఒక ప్రముఖ కాలేజీలో లెక్చరర్‌గా నెలకు రూ. 1.5 లక్షలు సంపాదించేది. ఆమె పనిచేసే చోట పిల్లల కోసం క్రెష్ (శిశు సంరక్షణ కేంద్రం) సౌకర్యం కూడా ఉంది. కానీ పాప పుట్టిన తర్వాత పరిస్థితులు మారాయి. క్రెష్‌లో పాప సర్దుకోలేకపోయింది. పని, పసిబిడ్డ పెంపకం రెండూ చూసుకోవడం ఆమెకు భారంగా మారింది. ఇంటికి వచ్చేసరికి పూర్తిగా అలసిపోవడంతో, పాపతో గడిపేందుకు ఓపిక ఉండేది కాదు. దీంతో, ఆ ఉద్యోగాన్ని వదిలేసి, నెలకు రూ. 75,000 జీతంతో ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రమ్ హోమ్) ఉద్యోగంలో చేరింది. జీతం సగానికి సగం తగ్గినా, ఇప్పుడు పాపతో ఉంటూ, పని చేసుకుంటూ ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నానని స్వాతి చెబుతోంది.
ఇది కేవలం స్వాతి కథ మాత్రమే కాదు. చాలామంది ఉద్యోగినులు ఇదే బాటలో పయనిస్తున్నారు. ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న శివాంగి పాండే వంటి తల్లులు, కెరీర్‌లో ముందుకు వెళ్లే అవకాశాలున్నా, పిల్లలు చిన్నవారైనందున వాటిని తాత్కాలికంగా వదులుకుంటున్నారు. ముఖ్యంగా విదేశీ ప్రాజెక్టులకు వేర్వేరు టైమ్ జోన్‌లలో పనిచేయాల్సి రావడం వల్ల, వాటిని పక్కనపెడుతున్నామని ఆమె తెలిపారు. "పనివేళల్లో ఫ్లెక్సిబులిటీ లేకపోతే, ఉద్యోగం వదిలేయడం చాలా సహజంగా అనిపిస్తుంది" అని శివాంగి అంటారు.
మరోవైపు, 18 ఏళ్లుగా ఒకే సంస్థలో పనిచేస్తున్న డింపుల్ పర్మార్ లాంటి వారు కూడా ఉన్నారు. పిల్లల స్కూల్ సెలవులకు అనుగుణంగా తనకూ సెలవులు రావడం, పనివేళలు కచ్చితంగా ఉండటం వంటివి అధిక జీతం కన్నా విలువైనవిగా ఆమె భావిస్తున్నారు. "తక్కువ జీతంతో సర్దుకోగలను కానీ, నా కొడుకు పెరిగే ప్రతి క్షణాన్ని వదులుకోలేను" అని కృతిక ఒబెరాయ్ అనే మరో ఉద్యోగిని స్పష్టం చేశారు.
హెచ్‌ఆర్ నిపుణులు సైతం ఈ మార్పును గమనిస్తున్నారు. ఒకప్పుడు కేవలం జీతం చూసి ఉద్యోగంలో చేరేవారని, ఇప్పుడు ఫ్లెక్సిబుల్ పనివేళలు, హైబ్రిడ్ మోడల్, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలను కూడా ఉద్యోగులు పరిగణనలోకి తీసుకుంటున్నారని వారు విశ్లేషిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఉద్యోగినులు వెళ్లిపోతే కంపెనీకి నియామక, శిక్షణ ఖర్చులు పెరుగుతాయని, అందుకే వారిని నిలుపుకోవడానికి కంపెనీలు కూడా ఫ్యామిలీ-ఫ్రెండ్లీ పాలసీలను ప్రోత్సహిస్తున్నాయి.
మొత్తం మీద, ఆధునిక మహిళలు ఉద్యోగం విలువను కేవలం బ్యాంక్ ఖాతాలో పడే జీతంతో కాకుండా, అది తమ జీవితంలో మిగిల్చే సమయం, సంతోషం, సంతృప్తితో కొలుస్తున్నారు.