కారులో మరో మహిళతో భర్త.. సినిమాను మించిన సీన్‌తో అడ్డుకున్న భార్య.. వీడియో వైర‌ల్‌!

కారులో మరో మహిళతో భర్త.. సినిమాను మించిన సీన్‌తో అడ్డుకున్న భార్య.. వీడియో వైర‌ల్‌!

Mayank Singh caught with another woman wife stops car in cinematic scene video viral
  • మరో మహిళతో ఉన్న భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
  • తప్పించుకునేందుకు ప్రయత్నించగా కారు బానెట్‌పైకి ఎక్కిన వైనం
  • సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన భర్త
  • భర్త మయాంక్ సింగ్, అతని ప్రియురాలు మహి వర్మ అరెస్ట్
  • వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నడిరోడ్డుపై ఓ సినీ ఫక్కీ ఘటన చోటుచేసుకుంది. మరో మహిళతో కనిపించిన తన భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఓ భార్య, అతను తప్పించుకునేందుకు ప్రయత్నించగా కారు బానెట్‌పైకి ఎక్కి ప్రాణాలకు తెగించింది. సుమారు 100 మీటర్ల దూరం ఆమెను కారుతో పాటు ఈడ్చుకెళ్లిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. మీరట్‌లోని లోహియానగర్‌కు చెందిన సునీతా సింగ్‌కు, మయాంక్ సింగ్‌కు వివాహమైంది. అయితే, శనివారం సాయంత్రం లోహియానగర్‌లోని ఎల్-బ్లాక్ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో సునీత తన భర్త మయాంక్, మహి వర్మ అనే మరో యువతితో కలిసి కారులో ఉండటాన్ని గమనించింది. వెంటనే వారిని అడ్డగించి నిలదీయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మయాంక్ అక్కడి నుంచి తన టయోటా అర్బన్ క్రూయిజర్ టైసోర్ కారులో వేగంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు.

దీంతో సునీత కారుకు అడ్డంగా నిలబడింది. అయినప్పటికీ మయాంక్ కారును ముందుకు పోనివ్వడంతో ఆమె బానెట్‌పైకి ఎక్కేసింది. సహాయం కోసం గట్టిగా కేకలు వేస్తున్నా అతను కారును ఆపకుండా వేగంగా నడిపాడు. సుమారు 100 మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత స్థానికులు జోక్యం చేసుకుని కారును ఆపడంతో ఆమె కిందకు దిగింది. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అనంతరం బాధితురాలు సునీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై హత్యాయత్నం జరిగిందని, దాడి చేశారని, గత కొంతకాలంగా వరకట్నం కోసం వేధిస్తున్నాడని, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తన ఫిర్యాదులో ఆరోపించింది. రంగంలోకి దిగిన పోలీసులు, సునీత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. 

మయాంక్ సింగ్, మహి వర్మ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఘటనకు కారణమైన UP15ER3086 రిజిస్ట్రేషన్ నంబర్ గల కారును స్వాధీనం చేసుకున్నారు. లోహియానగర్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌)లోని సెక్షన్ 109(1), 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Mayank Singh
Sunita Singh
Meerut car bonnet incident
Uttar Pradesh viral video
Extra marital affair case
Meerut police arrest

More Telugu News