భవిష్యత్తు యుద్ధాలపై అమెరికా భారీ కసరత్తు.. కీలక బాధ్యతల్లో ఎలాన్ మస్క్!
- ప్రాజెక్టుకు ఎలాన్ మస్క్ సహా ముగ్గురి నేతృత్వం
- 120 రోజుల్లో నివేదిక సమర్పణకు గడువు
- భూగర్భం నుంచి అంతరిక్షం వరకు యుద్ధాలపై అధ్యయనం
- స్వయంప్రతిపత్తి యుద్ధ వ్యవస్థలకు ప్రత్యేక కమాండ్
- సైనిక స్థావరాల భద్రతకు ఫోర్ట్రెస్ అమెరికా
భవిష్యత్తులో యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయి? వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి అధునాతన సాంకేతికత అవసరం? సైనిక రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని ఎలా కొనసాగించాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు అమెరికా రక్షణ శాఖ కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్, రక్షణ రంగ సంస్థ ఆండ్యూరిల్ వ్యవస్థాపకుడు పామర్ లక్కీ, అమెరికా మాజీ ప్రతినిధుల సభ స్పీకర్ న్యూట్ గింగ్రిచ్‌లకు కీలక బాధ్యతలు అప్పగించింది.
120 రోజుల్లో నివేదిక
అమెరికా రక్షణ శాఖ ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ మెరిడియన్’కు ఈ ముగ్గురు సంయుక్తంగా నాయకత్వం వహించనున్నారు. రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. భవిష్యత్తు యుద్ధాల్లో అమెరికాకు అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన ఆయుధ వ్యవస్థలు, సైనిక సామర్థ్యాలను ఈ బృందం అధ్యయనం చేయనుంది. ప్రాజెక్టు ప్రారంభమైన 120 రోజుల్లోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇందులోని ప్రధాన వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. రహస్య సమాచారంతో ప్రత్యేక అనుబంధాన్ని కూడా రూపొందించనున్నారు.
భూమి నుంచి అంతరిక్షం వరకు..
భవిష్యత్తు యుద్ధాల్లో భూగర్భ ప్రాంతాల నుంచి భూమి, చంద్రుడి మధ్య ఉన్న అంతరిక్ష ప్రాంతం వరకు ఎదురయ్యే సవాళ్లను ఈ అధ్యయనం పరిశీలించనుంది. ఇందుకు అవసరమైన సాంకేతికతను గుర్తించి, వాటిని సైనిక అవసరాలకు అనుగుణంగా త్వరగా అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టనుంది. ఈ ప్రాజెక్టుకు అమెరికా రక్షణ శాఖ సాంకేతిక విభాగం అధిపతి ఎమిల్ మైఖేల్ సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. విద్యా, విధాన రూపకల్పన, పరిశ్రమలకు చెందిన నిపుణులు కూడా ఇందులో భాగం కానున్నారు.
మరో ఐదు కీలక ప్రాజెక్టులు
ప్రాజెక్ట్ మెరిడియన్‌తో పాటు మరో ఐదు కార్యక్రమాలను హెగ్‌సెత్ ప్రకటించారు. స్వయంప్రతిపత్తితో పనిచేసే యుద్ధ వ్యవస్థల అభివృద్ధి కోసం 2027 అక్టోబరు 1 నాటికి ప్రత్యేక కమాండ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సైనిక స్థావరాల భద్రత, దేశీయంగా కీలక విడిభాగాల తయారీని పెంచేందుకు ‘ఫోర్ట్రెస్ అమెరికా’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థలు, స్వయం సమృద్ధితో పనిచేసే విద్యుత్ సదుపాయాలతో కొత్త సైనిక స్థావరాన్ని నిర్మించనున్నారు. ఐదు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక సైనిక శిక్షణ కార్యక్రమాలు, సైనికులకు మతపరమైన సహకారం అందించేందుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు కూడా ఈ ప్రణాళికల్లో ఉన్నాయి.
ఎవరికి ఏ రంగంలో అనుభవం?
ఎలాన్ మస్క్ 2002లో స్పేస్‌ఎక్స్‌ను స్థాపించారు. రాకెట్లు, అంతరిక్ష నౌకల తయారీ, ప్రయోగాల్లో ఆ సంస్థ కీలకంగా పనిచేస్తోంది. పామర్ లక్కీ అమెరికా రక్షణ సాంకేతిక సంస్థ ఆండ్యూరిల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు. న్యూట్ గింగ్రిచ్ 1995 నుంచి 1999 వరకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌గా పనిచేశారు. వీరి అనుభవాన్ని భవిష్యత్తు యుద్ధాలకు అవసరమైన సాంకేతిక, వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పనలో వినియోగించుకోవాలని అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది.