ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. భారత పైలట్‌పై ఇజ్రాయెల్ ప్రధాని ప్రశంసలు.. 'నిజమైన హీరో' అంటూ కితాబు
- ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్‌పై కత్తితో దాడి చేసిన కో-పైలట్
- తీవ్రంగా గాయపడినా ధైర్యంగా ఎదుర్కొని ప్రయాణికులను కాపాడిన కెప్టెన్
- సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం
- భారత పైలట్‌ను 180 మందిని కాపాడిన 'నిజమైన హీరో' అన్న ఇజ్రాయెల్ ప్రధాని
- దాడికి పాల్పడిన సహ పైలట్‌ను అరెస్ట్ చేసిన సౌదీ అధికారులు
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఓ భారత పైలట్ సాహసోపేతంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని నివారించారు. విమానం గాల్లో ఉండగా తన సహ పైలట్ కత్తితో దాడి చేసినా, తీవ్ర గాయాలపాలైనా ధైర్యంగా ఎదురొడ్డి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనలో హీరోగా నిలిచిన పైలట్‌ను కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌గా గుర్తించారు.
అసలేం జరిగిందంటే..!
విమానం కాక్‌పిట్‌లో ఉండగా కో-పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ ఎదురుదాడి చేసి కాక్‌పిట్ డోర్‌ను తెరిచారు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది, ప్రయాణికులు వెంటనే దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కెప్టెన్ స్మిత్ ధైర్యాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. "తీవ్రంగా గాయపడినా వెనకడుగు వేయకుండా పోరాడి పెను విపత్తును ఆపి, 180 మంది ప్రయాణికులను కాపాడిన స్మిత్ నిజమైన హీరో" అని ఆయన కొనియాడారు. ప్రస్తుతం స్మిత్ సౌదీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
కెప్టెన్ స్మిత్‌కు 13 ఏళ్లకు పైగా విమానయాన రంగంలో అనుభవం ఉంది. గతంలో భారత విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లో పనిచేసిన ఆయన, 2022లో ఫ్లైదుబాయ్‌లో చేరారు. దాడికి పాల్పడిన కో-పైలట్‌ను సౌదీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది.